ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి 70 వేల రూపాయలు కాజేసిన దొంగకు ఆరు నెలలు శిక్ష విధించారు. జనగాం లోని గిర్నిగడ్డ లో నివాసం ఉండే మాచవరం రోజారాణి తన మనుమరాలి బారసాలకు పరకాల వెళ్లింది. అదను చూసుకున్న మాచవరం రుశిధర్ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తిరిగి వచ్చిన రోజారాణి తన ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తరచూ దొంగతనాలకు పాల్పడే మాచవరం రుశిధర్ ఈ నేరానికి పాల్పడ్డట్లు పోలీసులు కనుకొన్నారు. దాంతో వారు అతనిని పట్టుకొని రిమాండ్ కు తరలించారు. సాక్షుల వాంగ్మూలం ఆధారంగా అతని నేరాన్ని జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ ధృవీకరించారు. దాంతో అతనికి 6 నెలల జైలు శిక్షతో పాటు 50 రూపాయల జరిమానా విధిస్తు కోర్టు తీర్పు ఇచ్చారు. నిందితునికి శిక్ష విధించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, జనగామ ఎస్. ఐ శ్రీనివాస్ , కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ కృషి చేశారు.