27.7 C
Hyderabad
April 19, 2024 22: 57 PM
Slider ఖమ్మం

ఈ నెల30నుండి 6వ జాతీయ మహిళా క్రికెట్‌ లీగ్‌

#Sardar Patel Stadium

వరుసగా ఆరోసారి మహిళా క్రికెట్‌ లీగ్‌ పోటీలకు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం వేదికైంది. ఈ మెగాటోర్నీకి మొత్తం 12 రాష్ట్రాలనుండి మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు. పూర్తిగా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో క్రికెట్‌ పోటీలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఈ నెల 30న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తెలంగాణ విమెన్‌ టీ.20క్రికెట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డా.కూరపాటి ప్రదీప్‌ కుమార్‌ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారని టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ ఎండీ మతిన్‌

వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, డయ్యూ`డామన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ మహిళా క్రికెటర్లు, టీం మేనేజర్లు, టీం కోచ్‌లు తరలిరానున్నారు. ఖమ్మంలో జరిగే పోటీల్లో పాల్గొనే వారికి వసతి, భోజన ఏర్పాట్లు, డ్రస్సులు యువం

పౌండేషన్‌ చైర్మన్‌ డా.ప్రదీప్‌కుమార్‌ అందజేస్తారని ఆర్గనైజర్‌ మతిన్‌ మీడియాకు వెల్లడించారు. ఈ మెగా టోర్నీకి ఏడబ్ల్యూఐసీఏ డైరెక్టర్‌ సందీప్‌ ఆర్య, సీనియర్‌ మహిళా క్రికెటర్లు పాలకుర్తి ఝాన్సీ, వి.వినోద, పద్మ, రాధిక, కల్యాణి,

ప్రశాంతి, శివ, విజయ్‌ చౌదరి తదితరులు పాల్గొంటారని టోర్నీ ఆర్గనైజర్‌ వెల్లడించారు. యువం జిల్లా కన్వీనర్‌ రాజా టోర్నమెంట్‌ నిర్వహణలో ఉంటారని అన్నారు. తెలంగాణ జట్టుకు ఝాన్సీ, వినోద, శివ కోచ్‌లుగా ఉంటారని టోర్నీ

ఆర్గనైజర్‌ ఎండీ మతిన్‌ వెల్లడించారు. సాయంత్రం 4.30 గంటలనుండి రాత్రి 11 గంటల వరకు టోర్నమెంట్‌లో భాగంగా క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని క్రికెట్‌ ప్రేమికులు జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ లీగ్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Related posts

ఏపీఎస్ఆర్టీసీ లో తగ్గిన సరుకుల రవాణా చార్జీలు

Satyam NEWS

ముత్యాలమ్మ గుడి దగ్గర భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ

Satyam NEWS

కేసీఆర్ పుణ్యమా అని రోజుకూలిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

Satyam NEWS

Leave a Comment