39.2 C
Hyderabad
April 23, 2024 16: 33 PM
Slider నల్గొండ

తెలంగాణ లోని ప్రతీ పల్లె హరితవనం కావాలి

#Chirumarthy Lingaiah

ప్రతీ పల్లె హరితవనం కావాలని,నాటిన ప్రతి మొక్కను బతికించాలని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం 6 వ విడత కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గంలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో 6వ విడత హరితహారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటి,అనంతరం 7 లక్షల రూపాయల తో  సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, ఇంటింటికి తడి పొడి చెత్త బుట్టలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అని ఆయన అన్నారు. ప్రజలను బాగాస్వామ్యం చేస్తే హరితహారం విజయవంతం అవుతుంది అని అన్నారు.

అభివృద్ది పనులు ఎన్ని చేసిన గాలిని మాత్రం సృష్టించలేము అన్నింటి కంటే విలువైనది, మనవకోటికి జీవం స్వచ్ఛమైన గాలి అన్నారు. చెట్లను నాటండీ ప్రకృతి తో అటలాడవద్దు,విస్మరిస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి నిరంతర ప్రక్రియ ,దింతో పాటు మొక్కలని విరివిగా అందరూ నాటాలని తెలిపారు. రైతులను,ప్రజలను అధికారులు, ప్రజా ప్రతినిధులు , మొక్కలను నాటేందుకు ప్రోత్సహించాలని సూచించారు.

హరితహారం పల్లెకు పచ్చదనం పర్చుకోనుంది అని, హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటి రక్షించాలి అని ఆయన అన్నారు. తరిగి పోతున్న అడవుల శాతాన్ని తిరిగి పెంచడంతో వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని అన్నారు.

గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు అని గతంలో మండల కేంద్రాల్లో మొక్కలను పెంచితే రవాణా చేయడం కష్టంగా మారేది అని ఇప్పుడు అలా కాకుండా గ్రామాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు అని తెలిపారు.

Related posts

జాతీయ జెండాలో కూడా కమర్షియల్ ఆలోచనలు చేస్తే ఎలా?

Satyam NEWS

తిరుపతి రవాణా విభాగం లో వేడుకగా ఆయుధ పూజ

Satyam NEWS

అంతరించిపోతున్న కళలను బ్రతికించుకోవాలి

Satyam NEWS

Leave a Comment