32.4 C
Hyderabad
March 8, 2021 17: 49 PM
Slider ముఖ్యంశాలు

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుల అరెస్ట్

#MuluguPolice

ఏడుగురు మావోయిస్టు పార్టీ సభ్యుల్ని అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు.

పోలీసులు పామునూరు  అటవీ పాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నిన్న మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. సాయుధులైన ఈ మావోయిస్టులు పామునూరు అటవీ పాంతంలో పోలీసుల్ని మట్టుపెట్టేందుకు పేలుడు సామాగ్రిని అమరుస్తూ పోలీసుల కంటపడ్డారు.

దాంతో ఎలర్ట్ అయిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోవడం ప్రారంభించారు. పోలీస్ పార్టీ వారిని వెంబడించగా అందులో ఏడుగురు వ్యక్తులు పేలుడు సామాగ్రితో సహా దొరికారు. అక్కడి నుంచి వారిని తీసుకుని నిన్న రాత్రికి వెంకటాపురం పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.

అరెస్టు అయిన వారిలో

1) ఉండం పాండు S/o మంగ్లు, 30 సంIIలు, ST గొత్తి కోయ, కూలి r/o జెల్ల గ్రామం, వెంకటాపురం మండలం – మిలిషియా కమాండర్ 2) ముచ్చకీ భీమయ్య S/o జోగ, 21 సంIIలు, ST గొత్తి కోయ, కూలి r/o పామునూరు గ్రామం, వెంకటాపురం మండలం – మిలిషియా డిప్యూటీ కమాండర్ 3) సోడి లక్ష్మయ్య @ లక్మ S/o జోగ, 45 సంIIలు, ST గొత్తి కోయ, కూలి r/o జెల్ల గ్రామం, వెంకటాపురం మండలం – మిలిషియా సభ్యుడు

4) మడకం @ మడవి అడమయ్య S/o ఊర, 23 సంIIలు, ST గొత్తి కోయ, కూలి r/o జెల్ల గ్రామం, వెంకటాపురం మండలం – మిలిషియా సభ్యుడు 5) మడవి బుద్ర S/o కోస, 25 సంIIలు, ST గొత్తి కోయ, కూలి r/o చెలిమెల గ్రామం, వెంకటాపురం మండలం – మిలిషియా సభ్యుడు 6) మడవి  ఐతయ్య S/o ఇడుమ, 50 సంIIలు, ST గొత్తి కోయ, కూలి r/o జెల్ల గ్రామం, వెంకటాపురం మండలం – మిలిషియా సభ్యుడు

7) మడవి కోస S/o రాజు, 30 సంIIలు, ST గొత్తి కోయ, కూలి r/o జెల్ల గ్రామం, వెంకటాపురం మండలం – మిలిషియా సభ్యుడు ఉన్నారు.

ఈ ఏడుగురు గత కొన్ని సంవత్సరాల నుండి మావోయిస్ట్ పార్టీకి సానుభూతిపరులుగా పనిచేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీకి చెందిన సుధాకర్ ఆదేశాల మేరకు వీరంతా కలిసి పేలుడు సామాగిని అమరుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి

1) Cordex wire- 79.5 Mtrs, 2) Detonators-50, 3) Electrical wire i.e., Black & Green (12 mtrs), 4) Copro Battery (12 V)-01, 5) Nova Battery-01, 6) Walky Talky-01, 7) Car remote keys-02, 8) Thief guard with attached wire-01, 9) Small mechanism wooden sticks (2.5 inch)-01, 10) Wooden Bamboo directional mine-01, 11) 12V DC Mobile chargers with battery clips (03), 12) Small HW batteries- 05, 13) Heavy duty leak proof everyday batteries-04, 14) 2-Combined packed cell sets-03, 15) Eveready small batteries-61 & 16) Bows-04 & Arrows-08 లను స్వాధీన పరుచుకొన్నారు.

2018లో వెంకటపురం మండలం లోని ఎధిర గామంలో గల BSNL సెల్ టవర్ ను పేల్చి వేసిన సంఘటనలో వీరు నిందితులు. 2019లో రామానుజపురం గామ శివారులో చెరువు వద్ద కాలువ పనులు చేస్తున్న పోక్లైన్ ని తగులబెట్టిన సంఘటనలో కూడా వీరు పాల్గొన్నారు.  

పాత ముకునూరు పాలెం నుండి డోలి వెళ్ళే కాలిబాటలో పెస్సర్ బాంబ్ అమర్చి ఒకరి మరణానికి కారణం అయ్యారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో ఏటూర్ నాగారం ఏ ఎస్ పి గౌస్ ఆలం, ఓ ఎస్ డి శోభన్ కుమార్, సిఆర్పిఎఫ్141f అసిస్టెంట్ కమాండెంట్ ఎస్. గీతమ్మ, సి ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ బుద్ధిరామ్ సింగ్, సీఐ వెంకటాపురం శివప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. కిరణ్, ఎస్ఐ తిరుపతి, వాజేడు ఎస్ ఐ కే తిరుపతిరావు, పేరూరు ఎస్సై బి హరికృష్ణ ,సిబ్బంది పాల్గొన్నారు.

కె. మహేందర్, సత్యం న్యూస్

Related posts

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

బాబ్రీ మసీద్ పై తీర్పు ఎలా ఉన్నా స్వాగతిద్దాం

Satyam NEWS

రుణ మాఫీ రైతు బంధు తెలంగాణ ప్రత్యేకం

Satyam NEWS

Leave a Comment