38.2 C
Hyderabad
April 25, 2024 12: 13 PM
Slider సంపాదకీయం

కృష్ణపట్నం ఆనందయ్యకు ఏడు ప్రశ్నలు

#krishnapatnam anandaiah

కరోనా కు కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అద్భుతమైన స్పందన వచ్చింది. అది మందూ కాదో తెలిసిన వాళ్లూ తెలియని వాళ్లూ కూడా ఆనందయ్య మందుకు మద్దతు ఇచ్చారు. ఎంతో మంది ప్రజలు కృష్ణపట్నం తరలి వెళ్లారు.

కంట్లో చుక్కల మందు వేయగానే ఆక్సిజన్ పెట్టుకున్న పేషంట్ కూడా లేచి కూర్చున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ నాటు మందుకు మరింత క్రేజ్ తెప్పించాయి. ఎప్పుడైతే మందుకు గిరాకి పెరిగిందో అప్పటి నుంచి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దానిపై దృష్టి సారించారు.

పనులన్నీ మానుకుని ఆనందయ్య పని పట్టే చర్యలకు దిగారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆనందయ్య చుట్టూనే ఉన్నారు. ఆ తర్వాత ఆనందయ్యను కిడ్నాప్ చేశారని పుకార్లు వచ్చాయి. వాటిని ఆనందయ్య తీవ్రంగా ఖండించారు.

ఆ తర్వాత ఆనందయ్య తిరుపతిలో ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆవరణలో మందు తయారు చేస్తున్నట్లు జనసేన నాయకులు వీడియోలు తీసి విడుదల చేశారు. తాము అధికారికంగా మందు పరీక్షించేందుకు తయారు చేయిస్తున్నామని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు.

ఇదంతా పాత కథ.

ఇప్పుడు కొత్త కథ మొదలైంది. ఏపిలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. ఉదాహరణకు కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వారు. వారు ప్రజలకు ఉచితంగానే ఆనందయ్య మందును అందిస్తున్నారు.

తద్వారా పార్టీ ప్రచారం చేసుకుంటూ తమ పలుకుబడిని పెంచుకుంటున్నారు. రాజకీయాల సంగతి అలా ఉంచితే ఈ సందర్భంగా ఆనందయ్యను కొన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఏర్పడింది.

ఆనందయ్య సమాధానం చెప్పాల్సిన ప్రశ్నిలు ఇవి

1.మీ పేరుతో చాలా జిల్లాల్లో పంచుతున్న మందుకు మీకు సంబంధం ఉందా?

2.మీ ఫొటో తో కొన్ని చోట్ల, మీ ఫొటో లేకుండా కేవలం మీ పేరుతో మరి కొన్ని చోట్ల మందు పంచుతున్న విషయం మీ దృష్టికి వచ్చిందా?

3.ఇలా పంచుతున్న మందు మీరు తయారు చేసిందేనా? ఈ మందుకు మీ అనుమతి ఉందా?

4.మీరు మందు ఫార్ములాను ముందుగానే చెప్పేశారు. దాన్ని ఉపయోగించుకుని ఏపిలోని చాలా చోట్ల మందును తయారు చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చిందా?

5.మీ శిష్యుల పేరుతో చాలా మంది వైసీపీ నాయకుల వద్ద మీ పేరుతో మందు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా? మీ దృష్టికి వచ్చిందా?

6.పై విషయాలన్నీ మీకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారా? లేదా మీకు తెలియదా? తెలిసి ఉంటే మీరు వాటిని అంగీకరిస్తున్నట్లేనా?

7.మీ పేరుతో ఎక్కడిక్కడ మందు తయారు చేసి పంపిణీ చేస్తుంటే అది ఏదైనా వికటిస్తే మీరు బాధ్యత వహిస్తారా? మీరు బాధ్యత తీసుకోని పక్షంలో ఇలాంటి కార్యక్రమాలను ఆపాలని ప్రభుత్వాన్ని కోరతారా?

ఈ ప్రశ్నలకు ఆనందయ్య సమాధానం చెప్పాల్సి ఉంది.

Related posts

వ్యాక్సినేషన్ 100 కోట్లు పూర్తయిన సందర్భంగా మోడి చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

పోలీసులు నిర్వహించే స్పందనకు వచ్చిన ఫిర్యాదులు ఎన్నంటే…!

Satyam NEWS

ఫార్మర్ వెల్ఫేర్:సంఘటిత రైతాంగ పోరాటానికి సిద్ధం

Satyam NEWS

1 comment

Shyam June 9, 2021 at 1:10 PM

APSRTC – A -అడిగిన P-ప్రతిదానికి S-సమాధానం R-రాదు T-తెలియదు C-చెప్పలేము

Reply

Leave a Comment