37.2 C
Hyderabad
March 28, 2024 18: 16 PM
Slider ప్రపంచం

రష్యా నుంచి వచ్చిన 70 వేల ఏకే 203 ఎస్సాల్ట్ రైఫిల్స్

#rifil

70 వేల అత్యంత అధునాతనమైన ఏకే 203 కలాస్నికోవ్ ఎస్సాల్ట్ రైఫిల్స్ భారత్ కు చేరుకున్నాయి. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న మేరకు రష్యా ఈ రైఫిల్స్ ను తయారు చేసి పంపింది. గత వారం రోజులలో మొత్తం రైఫిల్స్ రావడంతో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తి అయినట్లు అయింది. మొత్తం ఆరు లక్షల 70 వేల ఏకే 203 రైఫిల్స్ మన దేశానికి అవసరం అవుతాయి.

అందులో భాగంగా 70 వేల రైఫిల్స్ ముందుగా వచ్చాయి. మిగిలిన 6 లక్షల రైఫిల్స్ ను భారత్ లో తయారు చేస్తారు. 600,000 AK-203 ఉత్పత్తి కోసం ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) అనే ప్రత్యేక ప్రయోజన జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. అధునాతన ఆయుధాలు & ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWEIL) & మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL) లాంటి డిఫెన్స్ PSUలు, రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్‌పోర్ట్ (RoE) & కన్సర్న్ కలాష్నికోవ్ (CK)లకు ఇందులో భాగస్వామ్యం ఉంటుంది.

అమేథీలో ఈ జాయింట్ వెంచర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి 2021 డిసెంబర్ 6 న భారత్ రష్యా మొత్తం ఒప్పందం కుదిరింది. 7.62 x 39mm క్యాలిబర్ AK-203 రైఫిల్స్ మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ఇన్-సర్వీస్ INSAS రైఫిల్స్ స్థానంలోకి వస్తాయి. AK-203 అసాల్ట్ రైఫిల్స్ రేంజ్ 800 మీటర్ల వరకు ఉంటుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల దీన్ని ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది.

Related posts

నీట్ 150 ఫైనల్ గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్ మెటీరియల్ రెడీ

Satyam NEWS

ఆక్సిజన్ కోసం విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ

Satyam NEWS

మైనారిటీ కమిషనర్ కి పోస్ట్ కార్డుల ద్వారా ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment