30.7 C
Hyderabad
April 24, 2024 00: 55 AM
Slider పశ్చిమగోదావరి

రూ. 7500 కోట్ల‌తో 16 కొత్త‌ మెడిక‌ల్ కాలేజీలు

Aarogya sri

రాష్ట్రంలో ఒకేసారి రూ. 7,500 కోట్ల‌తో 16కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటున‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వైద్య, విద్యా రంగంలో పెను మార్పులకు దొహదం చేసిందని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఒక్కో మెడికల్ కాలేజీని 50ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఆళ్ల నాని స్ప‌ష్టం చేశారు. ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం చింతలపూడి MLA ఎలిజా మంత్రి ఆళ్ల నానీని కలిశారు. ఈ నెల 19న చింతలపూడిలో 30 పడకల ఆసుప‌త్రిని 100పడకల ఆసుప‌త్రిగా తీర్చిదిద్ది నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. మంత్రి ఆళ్ల నానీని MLA ఎలిజా చింతలపూడి నియోజకవర్గానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నానీ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి రూ. 23 కోట్ల‌ అంచనాలతో వంద పడకల ఆసుప‌త్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్న989 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలను మరింత మెరుగు పరచడం కోసం రూ. 413 కోట్లు ఖర్చు చేయనున్నామని మంత్రి తెలిపారు.

చింతలపూడిలో 100పడకల హాస్పిటల్ నిర్మాణం వల్ల పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని, కృష్ణా జిల్లా చాట్రాయి, మాకుల్లా, పోలవరం, పలు గ్రామాలకు వైద్య సేవలు విస్తరించి పేదవాళ్ళు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 149నూతనంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ నిర్మాణానికి రూ. 257 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, 45ఏరియా ఆసుప‌త్రి, 123 సామాజిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడానికి రూ. 12.36 కోట్ల లతో అంచనాలు సిద్ధం చేశామని, ఆరోగ్య శ్రీ రిఫరల్ విధానాన్ని మెరుగు పరచడం కోసం డాక్టర్ వైస్సార్ హెల్త్ క్లినిక్ లు వచ్చే వరకు సంబందించిన గ్రామ ఆరోగ్య మిత్రలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచి అత్యవసరమైన రోగులకు తగు సమాచారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

Related posts

శబరీ నదిలో మునిగిపోయిన లాంచీ

Satyam NEWS

శాసనసభ ఎన్నికలకు సిద్ధం కండి: డీజీపీ

Bhavani

మంత్రి పువ్వాడకు బ్రాహ్మణ సంఘం మద్దతు

Bhavani

Leave a Comment