31.2 C
Hyderabad
May 29, 2023 22: 06 PM
Slider సినిమా

“మల్లేశం” దర్శకనిర్మాత నుంచి “8 ఎ.ఎమ్. మెట్రో” రేపే విడుదల

#8 AM Metro

“మల్లేశం” చిత్రంతో అటు ప్రేక్షకులు – ఇటు విమర్శకుల ప్రశంసలు దండిగా అందుకున్న “ప్రవాస తెలంగాణ ముద్దుబిడ్డ” రాజ్ రాచకొండ తాజాగా రూపొందించిన చిత్రం “8 A.M మెట్రో”. స్వీయ దర్శకత్వంలో కిషోర్ గంజితో కలిసి రాజ్ రాచకొండ నిర్మించిన ఈ చిత్రం రేపు (మే 19) తొలుత హిందీ భాషలో విడుదల కానుంది. తదుపరి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అనువాదం కానుంది.

గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సన్నీ కుర్రపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కె.రాబిన్స్ సంగీతం అందించారు. అనిల్ ఆలయం ఎడిటింగ్. ఉదయ్ తిరుచాపల్లి వి.ఎఫ్.ఎక్స్ బాధ్యతలు నిర్వహించారు. భావావేశం మెండుగా కలిగినప్పటికీ…

నిర్లిప్తంగా సాగిపోతున్న ఒక వివాహిత జీవితంలో… “మెట్రో ట్రైన్”లో జరిగిన పరిచయం… “స్నేహం”గా మారడం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని కవితలు ప్రఖ్యాత గీత రచయిత – ఆస్కార్ అవార్డు గ్రహీత గుల్జార్ రాయడం విశేషం.

Related posts

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ట్రాజడీ:ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి అనంతలోకాలకు

Satyam NEWS

అసాంఘిక కార్యకలాపాలకు సీసీ కెమెరాలతో చెక్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!