24.7 C
Hyderabad
March 29, 2024 07: 19 AM
Slider గుంటూరు

9న ద‌ళిత సంఘాల రౌండ్ టేబుల్ స‌మావేశం

Dhalita Sangam

దళిత బహుజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాల‌ని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చార్వాక, అట్లూరి విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 9వ తారీఖున దళిత బహుజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్నినిర్వ‌హిస్తామ‌న్నారు. వినుకొండలోని నవయుగ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో ఈ సమావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు జేఏసీ కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్ వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా నరసరావుపేట లోని అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాల‌యంలో విలేఖ‌రుల సమావేశం నిర్వహించారు. అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద వర్గాల పైన హత్యలు, హత్యచారాలు జ‌రుగుతుంటే చూస్తూ మౌనం వ‌హించ‌డం భారత రాజ్యాంగాన్నినిర్లక్ష్యం చేయ‌డ‌మేన‌ని ఆరోపించారు. ఏఎన్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక మాట్లాడుతూ దళిత బహుజన సంఘాల నాయకులను ఏక‌తాటి పైకి తీసుకొని వచ్చి రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ శక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలను పూర్తిస్థాయిలో ప్రచారకులుగా తీర్చిదిద్దాలలే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వ‌హిస్తున్న పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జెడ్ పి టి వీరస్వామి, బాపట్ల పార్లమెంటరీ ఏ ఎం పి ఎస్ సెక్రటరీ, పరిమళ చిరంజీవి జనరల్ సెక్రెటరీ అమ్మ ఫౌండేషన్, కట్టా సునీల్ మాల మహానాడు జిల్లా జనరల్ సెక్రెటరీ, షేక్ షాహీ నా, ఇటిక్యాల క్రిస్టఫర్ గారు ఏం పేస్ సెక్రెటరీ మరికొంత మంది పాల్గొన్నారు.

Related posts

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో నూతన శకం

Satyam NEWS

గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్

Bhavani

విజయనగరం బాణా సంచా షాప్ లకు పోలీసుల వార్నింగ్..

Satyam NEWS

Leave a Comment