39.2 C
Hyderabad
April 25, 2024 16: 30 PM
Slider గుంటూరు

ఈ తొమ్మిది ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి

#balakotaiah

అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య డిమాండ్

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హంగామా, పంపిణీ పండుగ కార్యక్రమాలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రికి 9 ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.

  1. ముఖ్యమంత్రి గారు…, మీరు పంపిణీ చేస్తున్న సెంటు పట్టాల స్థలాలు ఎక్కడివి? మీ సొంతమా? ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసినవా? అవి ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? రాజధాని కోసం ఇచ్చిన భూములను సెంటు పట్టాలుగా ఇవ్వటం అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కాదా?
  2. సెప్టెంబర్ లో విశాఖ రాజధానికి వెళ్తున్నాను అని ప్రకటించిన మీరు విశాఖ రాజధానిలోనే నిరుపేదలకు నివేశన స్థలాలు ఇవ్వలేరా? మీకు దగ్గరలో పేదలు ఉండకూడదా?

3.అమరావతి స్మశానం, ఎడారి, ఒక సామాజి వర్గం వారిదే అని చెప్పిన మీరు, పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అక్కడే సెంటు పట్టాలు ఇవ్వడంలో అర్థం ఏమిటి? జోన్ 3 కింద 5 శాతం భూమిని పేదలకు ఇవ్వాలని సి ఆర్ డి ఏ చట్టంలో ఉండగా, ఆర్ 5 జోన్ ఎందుకు? జోన్ 3లో ఉన్న 5,400 టిట్కో గృహాలను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రాజధానిలో కంప చెట్లు తొలగించేందుకు మనసు రాని మీకు ఇళ్ళ స్థలాల మంజూరు పై మోజు ఎందుకో

4 దేవతలు యజ్ఞం చేస్తుంటే, రాక్షసులు అడ్డుకుంటున్నారు? అంటున్న మీరు చాలీచాలని సెంటు పట్టాలే యజ్ఞమా? ఒక్క సెంటు తో పేదల బతుకుల్లో వెలుగులు వస్తాయా? సెంటు స్థలం లో నివాసం ఉంటున్న అగ్రవర్ణాల వారిని ఒకరినైనా చూపగలరా?

5.భూములు కొనుగోలు చేసి నిరుపేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం ఇవ్వలేరా? మీ రాక్షస పాలను ప్రజలే దేవతలై అడ్డుకుంటున్నారు అన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా?

  1. మీ బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో గూగుల్ టేక్ అవుట్ లో దొరికిన నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయటానికి చేతులు రాని ఏపీ పోలీసులకు రాజధాని శిబిరాల్లో రైతుల్ని ఎగబడి ఎలా అరెస్ట్ చేస్తున్నారు? ప్రజాస్వామిక నిరసనలను ఎలా కాల రాస్తున్నారు?

7.మీరు పంపిణీ చేస్తున్న సెంటు పట్టాలు పవిత్రమా? ఆ స్థలాన్ని ఇచ్చిన రైతుల పొలాలు అపవిత్రమా? ఇది రెండు నాలుకల ధోరణి కాదా?

8.న్యాయస్థానం నివేశన పట్టాలకు హక్కులు కల్పించవద్దు అని చెప్పినా, విచారణ ఇంకా జరుగుతున్నా, ఆగమేగాల మీద పంపిణీ చేసి ఇల్లు నిర్మిస్తామని చెప్పటంలో మర్మం ఏమిటి? కొత్త ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ కుట్ర కాదా?

  1. గతంలో ఇచ్చిన 30 లక్షల ఇళ్ళ పట్టాలకు దిక్కుమొక్కు లేదు. ఇచ్చిన నీవేశనా స్థలాలల్లో ఎన్ని ఇళ్ళు నిర్మించారు? ఎన్ని జగనన్న కాలనీలు నిర్మాణం చేశారు?.

రాష్ట్రంలో మూడు రాజధానుల మంట పెట్టి, అమరావతిలో చిచ్చి పెట్టి, ప్రత్యేక హోదా ఎగొట్టి, పోలవరం పండబెట్టి, అబద్ధాల పునాదులపై పాలన చేస్తున్న మీ వైఖరి ప్రజలకు తెలిసిపోయింది. రానున్న ఎన్నికల్లో మీ భవిష్యత్తును తేల్చేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని బాలకోటయ్య హెచ్చరించారు.

Related posts

దళిత ద్రోహిగా మారిన భారతీయ జనతా పార్టీ: టీఆర్ఎస్ వ్యాఖ్య

Satyam NEWS

మాయరోగం కరోనా కాదు మరొకటి ఉంది

Satyam NEWS

సత్వర న్యాయం అందేలా న్యాయస్థానాలు చొరవతీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment