29.2 C
Hyderabad
September 10, 2024 16: 13 PM
Slider ముఖ్యంశాలు

ఒక్క రోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ

#chandrababunaidu

1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం అని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు అంటే…ప్రభుత్వంలో భాగం. ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశాం. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా…. అనేక సమస్యలు ఉన్నా రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1తేదీనే చెల్లించాం. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కలిసి కష్టపడదాం… రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని పిలుపునిస్తున్నా అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Related posts

అసంపూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోని రాజకీయ పెద్దలు

Satyam NEWS

ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారయత్నం

Bhavani

విహార యాత్రలో విషాదం

Satyam NEWS

Leave a Comment