Slider ఆంధ్రప్రదేశ్

9న కొప్పరపు కవుల కళాపీఠం మహాసభ

kopparapu

సాహిత్య సేవలో విశిష్టత కనబరిచే కొప్పరపు కవుల కళాపీఠం మరో సంగీత సాహిత్య ఆధ్యాత్మిక సమాగమ సాంస్కృతిక మహాసభ నిర్వహిస్తున్నది. ఈ నెల 9వ తేదీ విశాఖపట్నం కళాభారతి AC ఆడిటోరియమ్ లో సాయంత్రం 6 గంటలకు ఈ అద్భుత సమాగమం జరుగుతుందని నిర్వాహకుడు మా శర్మ తెలిపారు. ఈ సంగీత సాహిత్య ఆధ్యాత్మిక సమాగమ సాంస్కృతిక మహాసభ లో కుర్తాళ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి ( పూర్వాశ్రమ విఖ్యాత డాక్టర్ ప్రసాదరాయ కులపతి) వారికి ” గురుపూజ”- సుప్రసిద్ధ గాయని పి సుశీల గారికి కొప్పరపు కవుల “జాతీయ ప్రతిభా పురస్కారము” – అవధాన కవివృద్ధులు ఆశావాది ప్రకాశరావు గారికి “అవధాన పురస్కారము” ప్రదానం చేస్తామని మాశర్మ తెలిపారు.ఇంకా  ఎందరెందరో మహనీయులు పాల్గొనే ఈ సభ  శ్రీ నారాయణతీర్థ తరంగగానముతో శుభారంభమవుతుందని ఆయన వివరించారు.

Related posts

సిజెఆర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బీరం వర్గీయులు

Satyam NEWS

ఆర్ధిక మంత్రిగా హరీష్, పాతశాఖకే కేటీఆర్

Satyam NEWS

గిరిజనులపై విద్యుత్ శాఖ అధికారుల కక్ష

Satyam NEWS

Leave a Comment