ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా రిటైర్డ్ సీనియర్ ఐపిఎస్ అధికారి ఏ.బి వెంకటేశ్వరరావును నియమించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏ.బి వెంకటేశ్వరరావు నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్ గురైన ఏ.బి వెంకటేశ్వరరావును కూటమి ప్రభుత్వం ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏబీపై తీవ్రంగా కక్ష సాధింపులకు పాల్పడ్డాడు. ఆయనను సస్పెండ్ చేయడం సబబు కాదని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డా కూడా ఖాతరు చేయకుండా రెండు సార్లు సస్పెండ్ చేశాడు. చివరకు కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించింది.
previous post
next post