ఒక చిన్న ఆలోచన…సంతోషాన్ని తెచ్చిపెట్టింది.. బలగం సినిమాలో చెప్పినట్టుగా బందువులు అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడిపారు…కుముదవల్లి బలంగా పేరు గంచారు.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన నక్క,ధర్మాల,రాగాల కుటుంబాల కనుమ రోజు ఒక్కచోట కలిసి ఆనందం గా గడిపారు.. ఇందులో విచిత్రం ఏమి ఉంది అనుకోవచ్చు..ఇక్కడే ఉంది అసలు కథ ప్రతి సంక్రాంతికి వీరు ఓ ఆచారంగా చేస్తూ వస్తారు..కనుమ రోజున గ్రామ దేవత ఐన కంచలమ్మ తల్లిని దర్శించుకొని నైవేద్యం సమర్పించి సంబరాలు జరుపుకుంటారు..
తాత,మామ,అమ్మమ్మ,నాన్నమ్మ, తాతయ్య ,అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని, బాబాయ్, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు , మనవడు, మనవరాళ్లు, బావలు, బమ్మర్ధులు,మరదళ్ల,వదినలు అందరూ ఒకే చోట చేరి కష్ట సుఖాలు పంచుకొని, సంబరాలు చేసుకుంటారు… ఆటపాటల తో సంతోషంగా గడుపుతారు…అసలు ఇలా చేయడానికి ప్రధాన కారణాన్ని నక్క వెంకట రమణ వివరించారు. భావి తరాల వారికి సంస్కృతీ సంప్రదాయాలు తెలపడం తో పాటు, కలిసి ఉంటే కలదు సుఖం అన్న పెద్ద సూక్తులు పెద్దలు గా పిల్లలకు నేర్పాలని,ఐక్యత తో ముందుకు సాగితే బలగం బలపడుతుందన్నారు…
పెద్దల పట్ల చిన్నలకు గౌరవం,చిన్న పట్ల పెద్దల ఆశీర్వాదాలు లభిస్తయాన్నారు…బిజి బిజి జీవితాల్లో ఏడాది లో ఒక్కరోజు ఒక్కచోట కలిసి సంతోషంగా గడిపితే మనసుకు ప్రశాంత తో పాటు బంధువుల్లో ఉల్లంగా కలుగుతుందని ఈ కలయిక అని తెలిపారు.. ధర్మాల రాఘవులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అందరూ ఒకేచోట కలవడం కన్నుల పండుగగా ఉంటుందన్నారు..అన్నదమ్ముల బిడ్డలు,ఆడబిడ్డలు అందరం ఒకే తాటిపై ఉండడం ఆనందాన్ని ఇస్తుందన్నారు..ధర్మాల కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా కనుమ రోజు జరిగే ఒక్కరోజు కార్యక్రమం ఏడాది ఆనందాన్ని పంచుతుందన్నారు.. కళ్ళ ముందు పిల్లల పాపలను చూస్తూ ఉంటే ఎంతో ఆనందం అన్నారు.. కోట్ల సంపాదన కన్నా…కన్న తల్లి ప్రేగుకు బంధం.. ఆ బందల ద్వారా వచ్చే బలం మన ఆస్తి అన్నారు..ఈ కార్యక్రమం లో ధర్మాల రాఘవులు,నక్క వెంకట రమణ,ధర్మాల కృష్ణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పూడి రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు ఉండి