28.7 C
Hyderabad
April 24, 2024 03: 32 AM
Slider ప్రత్యేకం

A big game: కొల్లాపూర్ రాజకీయానికి అన్నీ ప్రత్యేకతలే

#kollapurleaders

ఎన్నికల ముందు హడావిడి చేసి ఎన్నికలు ముగిశాక గెలిచినవారు, ఓడినవారు ఎక్కడ ఉంటున్నారు.? వారి పరిస్థితి ఏంటి? ప్రజలు వారికి గుర్తుకు వస్తారా? గెలిచిన వాళ్ళు పట్టణలలో సెటిల్ అవుతున్నారు. ఓడినవారు నియోజవర్గంలో మొహం చూపించలేని స్థితి ఉంటుంది.

మళ్లీ ఎన్నికల ముందు కనిపిస్తారు. లేదంటే అప్పుడప్పుడు పండుగలకు పబ్బాలకు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు అంటే ఇలాగే ఉంటారు అని అందరూ అనుకుంటారు.కానీ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ నేతలకు మాత్రం ఓ పద్ధతి ఉంది. రాజకీయంగా ప్రజా సేవ లక్షణాలు వంద శాతం ఉన్నాయి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అలా వాలిపోతారు ఈ ప్రాంత నేతలు.

కొల్లాపూర్ నియోజక వర్గ ప్రత్యేకత ఇది

కొల్లాపూర్ నేతల గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు. అవును ఇది నిజం. ఎందుకంటే ఏ స్వార్థం లేని నిస్వార్థ పరులని చెప్పవచ్చు.నేటి కాలంలో స్వార్ధం లేని నాయకులు ఎవరు లేరు. కానీ వారికి కూడా స్వార్థం ఉంది అందుకోసమే రాజకీయం చేస్తున్నారని పలువురు అంటున్నారు.

ఆ స్వార్థం ఏంటో తెలుసుకుందాం.వారిలో ఫిల్టర్ చేస్తే వారి గురుంచి ప్రజలే చెబుతారు.

చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేసుకుంటాను: జూపల్లి

తెలంగాణ ఉద్యమ నేత,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన నేటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే సుదీర్ఘ 20 ఏళ్ల రాజకీయంలో ఆయన దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మూడు పర్యాయాలు మంత్రిగా చేశారు. 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు.ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి త్యాగం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించారు.ఇది జగమెరిగిన సత్యం.అయితే రాజకీయంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.మూడు సార్లు మంత్రిగా ఉన్నారు.ఇంకా చెప్పాలంటే ప్రత్యేక రాష్ట్రంలో భారీ పరిశ్రమల శాఖ, గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా చేశారు.

ప్రస్తుతం ప్రజల కోసం నిరంతరం ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఆయన 2018 ఎన్నికల అనంతరం అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోసిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు అందరూ అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు ఎవరు నోరు తెరవలేదు. కానీ జూపల్లి అనుచరులు మాత్రమే ప్రతి సమస్యపై మాట్లాడుతూ వచ్చారు.

ఇది వాస్తవం.అందుకే మున్సిపల్ ఎన్నికల్లో సింహం జండా ఎగరవేశారు.ఆనాడే చెప్పారు జూపల్లి కృష్ణారావు. గెలుపు ఓటములు సహజం.నా చివరి శ్వాస వరకు కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు సేవ చేసుకుంటాను.వారితోనే ఉంటానని చెప్పారు.

ప్రస్తుతం వారి కంటికి కునుకు లేకుండా నియోజకవర్గ ప్రజల సమస్యల పైన తిరుగుతున్నారు.ప్రజలపై అక్రమకేసులు పెట్టీ వేధిస్తున్న కొందరి పోలీసుల తీరును ఎండగడుతున్నారు.చివరికి జూపల్లి పైనే కేసులు నమోదు అయ్యేవిధంగా చేశారు.

పట్టువదలని విక్రమార్కుడు ఎల్లేని హైవే సుధాకర్ రావు

ఇక ఆయన ఇంటిపేరు హైవే గా మార్చుకున్నారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని పట్టువదలని విక్రమార్కుడు.ఆయననే ఎల్లేని సుధాకర్ రావు. ఆయన గత 2018 ఎన్నికల ముందు లక్షల ఉద్యోగాన్ని వదులుకొని కొల్లాపూర్ ప్రజలకు సేవ చేసుకోవడానికి రాజకీయ ప్రవేశం చేశారు.

ముందుగా యువతను ఏకం చేసి, కే వై ఎఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా యువతకు ఎన్నో అవకాశాలు కల్పించారు.ఉద్యోగ శిక్షణలు, ఉన్నత చదువులకు శిక్షణలు ఉచితంగా ఏర్పాటు చేశారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన ఆదర్శంగా నిలిచారు.అలా 2018 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఎప్పుడు ఈ నియోజకవర్గంలో మూడు వేలు, నాలుగు వేల ఓటు బ్యాంక్ బిజెపికి వచ్చేది.

కానీ ఆయన రాజకీయం చేశాక ఏకంగా 13 వేల ఓట్ బ్యాంక్ ఈ నియోజకవర్గంలో బిజెపికి వచ్చింది. ఇది బిజెపికి చరిత్ర అని కూడా చెప్పొచ్చు.అయితే ఆయన ఓటమి అయినా కానీ,ఏనాడు వెనక్కి తగ్గలేదు. ఎన్నికల ముందు కొల్లాపూర్ మీదుగా జాతీయ రహదారి సోమశిల- సిద్దేశ్వరం వంతెన నిర్మాణం అయ్యే వరకు నిద్రపోనని ఆయన చెప్పారు. 2018 ఎన్నికల బహిరంగ సభ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో హామీ కూడా ఇప్పించారు.

ఇప్పుడు అది నెరవేరబోతోంది అని చెప్పవచ్చు. గతంలో జూపల్లి కృష్ణారావు సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు శిలాఫలకం వేయించారు. ఇది వాస్తవం.అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోవడంతో ఆ వంతెన నిర్మాణం జరగలేదు. అయితే ఎల్లేని ఢిల్లీకి ఎన్నో పర్యాయాలు తిరిగారు.

కొల్లాపూర్ మీదుగా జాతీయ రహదారి సాధించారు.వంతెనకు, రహదారికి సంబంధించిన బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించే విధంగా ఆయన కృషి చేశారు.మొత్తానికి ఆయన కొల్లాపూర్ ప్రజల మధ్యలో ఉంటూ రైతుల సమస్యలపై ప్రజా సమస్యలపై గళమెత్తారు. లక్షల ఉద్యోగాలను వదులుకొని కొల్లాపూర్ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నారని తెలుస్తుంది.

బీరం తీరు వేరు

సుదీర్ఘంగా ఇరవై ఏళ్ల రాజకీయం చేసిన మంత్రి పదవిలో ఉన్న జూపల్లి కృష్ణారావును కాదని నియోజకవర్గ ప్రజలు మార్పు కోసమని బీరం హర్షవర్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిపించారు.ఇక ఎమ్మెల్యేగా గెలిచిన అంతలోనే ముచ్చటగా మూడు నెలలు కాకముందే వెంటనే అభివృద్ధి కోసం అని పార్టీ మారారు.

తర్వాత అభివృద్ధి జరిగింది ఏమిటో నియోజకవర్గ ప్రజలు చూస్తూనే ఉన్నారు.అయితే బీరం హర్షవర్ధన్ రెడ్డి మొదటగా టిడిపి, వై ఎస్ ఆర్ సి పి, కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎమ్మెల్యే గెలిచాక టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లారు.ఇన్ని పార్టీలు మారడానికి కారణం అభివృద్ధి కోసం, ప్రజలకు సేవ చేసుకోవడానికే అని చెబుతూ వచ్చారు.అయితే 2018 ఎన్నికల సమయంలో హర్ష వర్ధన్ రెడ్డి మాతృమూర్తి, ఆయన సతీమణి ప్రజల ముందు ఉంటూ గెలవడానికి ఎంతో కష్టపడ్డారు. ఇది వాస్తవం.

అప్పుడప్పుడు చుట్ట చూపుకు వస్తుంటారు.కార్యకర్తలను పలకరిస్తూ ఒక్కకసారి వారే చెక్కులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అభివృద్ధి కోసంమని పార్టీ మారిన తర్వాత జరిగిన పరిణామాలను ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. కొల్లాపూర్ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారా? లేక ప్రజలకు సేవ చేస్తున్నారా? అనేది ప్రజలు చెబుతున్నారు. ఎలాంటి సేవలు చేస్తున్నారో, ఆయన మీద ప్రజలు ఎంత ప్రేమగా ఉన్నాదో చూస్తూనే ఉన్నాము.

ప్రజలకు ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేస్తున్నారు.ఇక నెలకు పదిరోజులైన సరే కచ్చితంగా నియోజకవర్గానికి వస్తుంటారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి,సమస్యల పరిష్కారం చేయడానికి.ఇక నియోజకవర్గంలో ఎలాంటి కల్చర్ వచ్చిందో ప్రజలే చెబుతారు.ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉందని ఎమ్మెల్యే చెబుతున్నారు. ప్రజలకు నిరంతరం సేవాకార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతుంటారు. అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎలాంటి న్యాయం, సేవలు చేస్తున్నారో బాధితులే చెబుతారు.

ఒక్కసారైనా ఎమ్మెల్యేగా అవుతా.. ప్రజలకు సేవ చేసుకుంటా!

ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ముఖ్య నేత గురించి చెప్పు కోవాలి. ఆయన మనసు కూడా చాలా గొప్పది.ప్రస్తుతం ఎమ్మెల్యే మారిన పార్టీల కన్నా ఈ నేతానే ఎక్కువగా పార్టీలు మారారు.2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టికెట్ కూడా ఆశించారు.

చివరికి అది రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు లో ముఖ్య పాత్ర పోషించారు. తర్వాత అధికార పార్టీలోకి వలస వెళ్లారు. ఈ ప్రాంత ప్రజలకు సేవచేసుకోవడనికి ఉన్నట్టుండి అధికార పార్టీ నుండి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన అనుచరులకు ఎంతో అండగా నిలిచారు. 30 ఏళ్ల రాజకీయంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకోవాలి అనే భావనతో ఆయన ఉన్నారు. ఆయన వాస్తవంగా ఎంతో ఆర్థిక వేత్త.

ఆయన ఈ రాజకీయాలు వద్దు అనుకుంటే ఇక్కడున్న నేతలకు ఆయన ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తి.అలాంటి నాయకుడే చింతలపల్లి జగదీశ్వర రావు. ఆయనలో ఒక తపన ఈ ప్రజలకు సేవ చేసుకోవాలని. ఆయన ఈ వయసులో కూడా ఒక యువకుని లా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఆయన అనుచరులకు ఎంతో అండగా ఉంటూ ప్రజలకు సేవ చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన మంచి సేవ భావంతోనే తిరుగితున్నారు.

ప్రజల పక్షాన నిలవడానికి అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి

ఇప్పటిదాకా కొల్లాపూర్ నియోజకవర్గ ముఖ్య నేతల గురించి చెప్పుకున్నాం. కానీ అతి చిన్న వయసులోనే ఈ నేత నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు గా మారారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ నేతను అణగదొక్కే కుట్రలను కూడా చేస్తున్నారు.ఇది పుష్కలంగా కనిపిస్తుంది.

అయితే స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారి అధికార పార్టీలో కి వలస వెళ్లారు. జగదీశ్వర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలస వెళ్లారు.కానీ ఈ యువ నాయకుడు అధికార పార్టీలో మొదటగా ఉన్నారు. ఆ పార్టీలో ఉంటే ఆయనకు అన్ని ఉన్నాయి పదవులు తప్ప. ఆ పార్టీ లోనే ఉంటూ కొల్లాపూర్ నియోజకవర్గంలో మామూలు రాజకీయం చేయలేదు. అధికార పార్టీ నేతలకు ఒక పాయిజన్ గా మారారు ఆ సమయంలోనే.

అయితే ఆ అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి ప్రజలు కోరుకుంటున్న పార్టీ వైపు ఆయన అడుగు వేశారు.ఆ ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. అయితే ఆయనకు ఈ సమయంలో ఆ పార్టీలో కొందరు ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారనే మాటలు బాగా వినిపిస్తున్నాయి.ఇది ఆ పార్టీ వ్యక్తిగతం ఉండొచ్చు. ఆ పార్టీ నేతలకు తెలియాలి.

రంగినేని ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తనకంటూ ఓ క్యాడర్ ఉంది. అటు అధికార పార్టీలోనే ఉన్నప్పుడే నియోజకవర్గంలో ఆయన చక్కర్లు కొట్టారు.మొత్తానికి ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల సమస్యల పైన మాట్లాడుతున్నారు. మొదటి నుంచి నియోజకవర్గంలో ప్రజల మధ్యన ఉన్నారు కాబట్టి ప్రజలతో ఒక మంచి రిలేషన్ ఏర్పడింది. అవకాశం వస్తే నియోజక ప్రజలకు సేవ చేసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

మరికొందరు నేతలు కూడా….

ఇకపోతే కొందరు బహుజన నేతలు కూడా బీసీ వర్గాల నుండి కూడా ప్రజలకు సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు ఉన్నత చదువులు చదివి జ్ఞానం అందించే వారే కొందరి చేతుల కింద ఉన్నారు. అలాంటి భావాలతో ఆశిస్తున్నారు. మరికొందరు విద్యార్థి విభాగం నుండి ఉద్యమాలతో ముందుకు పోతున్నారు. అవకాశం వస్తే సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

కొల్లాపూర్ నేతలు గొప్పవారు

కొల్లాపూర్ నేతల గురించి చాలా గొప్పగా భావించాలి. ఎందుకంటే ఎన్నో నియోజకవర్గా నేతలను చూస్తున్నారు. ఇక్కడ రాజకీయ వర్గాలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు కానీ ఎవరైనా ఏ పార్టీ నాయకుడైన, ఏ వర్గ నేత అయిన ప్రజల మధ్యనే ఉంటున్నారు. నిరంతరం ప్రజల సమస్యలపైనే పని చేస్తున్నారు. కొందరు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. వారెవరో ప్రజలు చూస్తూనే ఉన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, కొల్లాపూర్

Related posts

అందరి సహకారంతో నెల్లూరు రూరల్ అభివృద్ధి

Bhavani

దమ్ముంటే నాకు సంకెళ్లు వెయ్

Bhavani

రాజంపేట 23% ఫిట్ మెంట్ జీవో కాపీల దహనం

Satyam NEWS

Leave a Comment