39.2 C
Hyderabad
March 28, 2024 16: 42 PM
Slider ప్రత్యేకం

A big question: ఆ 23 మంది గెలిస్తే ఎలా?

#yerraguntla

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల లెక్కింపు సజావుగా సాగుతున్నది. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే అందరిని వేధిస్తున్న సమస్య ఒక్కటే. ఆ ఇరవై మూడు మంది గెలిస్తే ఎలా అనేది ఆ ప్రశ్న. రాష్ట్రంలోని 23చోట్ల విచిత్ర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో 23 మంది అభ్యర్థులు గెలిస్తే ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా హైకోర్టు తీర్పు కారణంగా ఓట్ల లెక్కింపు ఐదున్నర నెలలపాటు నిలిచిపోయింది. ఈ కాలంలో పోలింగ్‌ జరిగిన పలు స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 23 మంది మరణించినట్లు ఎస్ఈసీ నిర్థారించింది. జెడ్పీటీసీ స్థానాలలో పోటీచేసిన అభ్యర్థులు ముగ్గురు మరణించగా.. ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేసిన వారు 20 మంది కన్నుమూశారు.

దీంతో ఈ స్థానాల్లో మరణించిన అభ్యర్థులు గెలుపొందితే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయాలంటూ ఎస్‌ఈసీ కార్యాలయ వివరణ కోరుతూ జిల్లాల అధికారులు లేఖ రాశారు. ఇందుకు కమిషన్‌ స్పందిస్తూ.. ఒకవేళ మృతిచెందిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ఫలితాన్ని వెల్లడించి.. తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన స్థానాల జాబితాలో ఆ స్థానాలను చేర్చాలని అధికారులు స్పష్టంచేశారు. ఇక నామినేషన్ల ఘట్టానికి, పోలింగ్‌ ప్రక్రియ మధ్య కూడా ఏడాదిపాటు ఖాళీ ఏర్పడింది. ఈ సమయంలో మరణించిన వారి స్థానాల్లోనూ పోలింగ్‌ను నిలుపుదల చేశారు. వీటన్నిటికి కలిపి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.

Related posts

క‌రోనాతో మ‌రో పోలీసు మృతి….! అదీ ఓ ఏఎస్ఐ….!

Sub Editor

స్వీట్లే కాదు సమాజానికి స్ఫూర్తిని పంచిన పుల్లారెడ్డి

Satyam NEWS

ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి నివేదికలను వెంటనే ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment