32.7 C
Hyderabad
March 29, 2024 11: 17 AM
Slider సంపాదకీయం

బిగ్ క్వశ్చన్: ఆంధ్రజ్యోతి… అధికారపార్టీ వీడియో..

#Park Hyath

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ బిజెపి నాయకులను కలుస్తారా? ఎంత తప్పు? రాజ్యంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీ నాయకులను కలవవచ్చా అనేది పెద్ద ప్రశ్న. ఇలా చేయడం ఎంత వరకు సమంజసం ….. ఇలా సాగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆనాటి వ్యాఖ్యానం.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ బిజెపి నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లను కలిసిన వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. వ్యాఖ్యాత వెంకట కృష్ణ దీనిపై తనదైన శైలిలో వ్యాఖ్యానం చేశారు. ఇదేంటి ఏబిఎన్ ఇలాంటి వార్త ప్రసారం చేసింది అంటూ ఎంతో మంది గుసగుసలాడుకున్నారు.

ఏబిఎన్ లో వచ్చే వార్త కాదే ఇది అంటూ ముక్కున వేలేసుకున్నారు. అసలు ఏం జరిగిందో అని అందరూ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని  శ్రీనివాస్, సుజనా చౌదరి కలిసిన దానికన్నా ఏబిఎన్ లో ఆ వార్త రావడాన్ని ప్రముఖంగా చెప్పుకున్నారు.

తీరా నేడు ఆ పత్రిక యజమాని రాసే కొత్త పలుకులో మరో విధంగా ఈ ప్రస్తావన ఉంది. కొత్త పలుకులో ఏం రాశారంటే ‘‘ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో భారతీయ జనతా పార్టీ ఎంపి సుజనా చౌదరిని అదే పార్టీకి చెందిన కామినేని శ్రీనివాస్, ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కలుసుకోవడాన్ని జగన్ అండ్ కో భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నించింది.

రమేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తన అఙ్ఞానాన్ని ఒలకబోసుకున్నారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత కూడా రమేష్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం విదితమే. ప్రభుత్వం దృష్టిలో ఆయన ఎన్నికల కమిషనర్ కాదు. అలాంటప్పుడు ఆయన ఎవరిని కలిస్తే ఏమిటంటే?’’ అంటూ వ్యాఖ్యానం వచ్చేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కొత్తగా చేరిన వెంకట కృష్ణ తొందరపడి వ్యాఖ్యానాలు చేశాడా? లేదూ ఆ విషయం తెలుసుకోకుండా రాధాకృష్ణ ఈ వ్యాఖ్యానాలు రాశారా? వెంకట కృష్ణ చెప్పింది కరెక్టో, రాధాకృష్ణ చెప్పింది కరెక్టో కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే పాఠకులకు క్లారిటీ ఉంటుంది.

Related posts

ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న‌, దిశ యాప్ పై అవ‌గాహ‌న‌, త్రిబుల్ డ్రైవింగ్ ల‌పై ఝ‌ల‌క్

Satyam NEWS

ఐజేయూ నేతలతో డిల్లీ జర్నలిస్టుల భేటీ

Bhavani

ఆస్ట్రేలియా కార్చిచ్చుపై ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్

Satyam NEWS

Leave a Comment