31.2 C
Hyderabad
February 14, 2025 19: 47 PM
Slider చిత్తూరు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్ట్ బిగ్ షాక్

#chevireddybhaskarreddy

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. పోక్సో చట్టం కింద తనపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

పదో తరగతి చదువుతున్న దళిత మైనర్‌ బాలిక స్కూలు నుంచి ఇంటికి వచ్చే దారిలో గాయాలతో పడి ఉంది. తన కూతురిపై దాడి జరిగితే.. అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ఆస్పత్రిలో చిరిగిన బట్టలతో చికిత్స చేయించుకుంటున్న ఫొటోలు తీసి మీడియాలో చూపించడం ద్వారా తమ గోప్యతను దెబ్బతీశారని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి కోరారు. బాలికపై అత్యాచారం జరిగిందని ఓ పత్రికలో, వైసీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై ఎర్రావారిపాలెం పీఎస్ లో చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది.

Related posts

ఏ.స్ రావు నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్  షోరూంలో “బ్రైడల్ జ్యువెలరీ షో

Satyam NEWS

డోర్నకల్ మిర్యాలగూడ మధ్య రైల్వే ప్రాజెక్ట్

Murali Krishna

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు 533వ జయంతి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment