వైసీపీ కి భారీ షాక్ తగిలింది. కుముదవల్లి సర్పంచ్ భూపతిరాజు వంశీ కృష్ణ రాజు, ఆయన అనుచరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్, ఉండి శాసనసభ సభ్యులు రఘురామ కృష్ణంరాజు సమక్షంలో టీడీపీ లో చేరారు. ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీ కృష్ణ రాజు తో పాటు వార్డు మెంబర్లు, కార్యకర్తలు భారీ స్థాయిలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యం లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వారికి డిప్యూటీ స్పీకర్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్దే తమ లక్ష్యం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుండే కాకుండా సొంతగా నిధులు సేకరించి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత అని తెలిపారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు. పార్టీలో చేరిన సర్పంచ్ భూపతిరాజు వంశీ కృష్ణ రాజు మాట్లాడుతూ సొంత ఇంటికి చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సీనియర్ జర్నలిస్టు పూడి రామకృష్ణ, ఉండి