27.7 C
Hyderabad
April 24, 2024 09: 24 AM
Slider ఖమ్మం

పేదలను పట్టించుకోని ప్రభుత్వం

#tammineni

ఆర్భాటం తప్ప కేంద్ర  బడ్జెట్ ఏమి లేదని అంతా డొల్లతనం మాత్రమే నని సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. స్థానిక సుందరయ్య భవన్ లో పోన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కమిటీ,మండల కార్యదర్శుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల గురించి బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదని, నిజాన్ని దాచి అందమైన చిత్రాన్ని చూపేందుకు ఆర్థిక  సర్వే  ప్రయత్నించిందని విమర్శించారు.    నిరుద్యోగం, ఆరోగ్యం , విద్య  తదితర  ముఖ్యమైన  సమస్యలను బడ్జెట్ పుట్టించు కోనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో శక్తినిస్తుందని కేంద్రం చెబుతున్నదని, మరి ఆర్థిక వృద్ధిరేటు 6.5% శాతానికే  పరిమిత మవుతుందని ఆర్థిక సర్వే ఎందుకు అంచనా వేసింది? గత ఆర్థిక సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వృద్ది 9.9% నుంచి 1.6% పడిపోయిందని, ఏకభిగిన నాలుగేండ్ల ఆర్థికవృద్ధి తగ్గటం స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు.ఆహార సబ్సిడీని 29 శాతానికి తగ్గించారని, మధ్యాహ్న భోజనానికి నిధులు 9.4శాతం తగ్గాయని, పౌష్టికాహార పథాకాలకు ఏకంగా 38 శాతం తగ్గాయని విమర్శించారు.

బడ్జెట్లో అణగారిన వర్గాలైన దళితులు గిరిజనులు మైనార్టీలు మహిళల సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూసి ఆర్థిక విశ్లేషకులు పెదవి విరుస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం షెడ్యూల్ కులాలు , షెడ్యూల్ తెగలు సంక్షేమానికి జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు తప్పనిసరి అని, ఈ బడ్జెట్ లో అలా జరగలేదని అన్నారు.దివ్యాంగులపైన కేంద్రం వివక్ష చూపిందని, మైనారిటీలకైతే బడ్జెట్ లో గత ఏడాది కంటే ఏకంగా 33 శాతం నిధులను తగ్గించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్ రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్,మాచర్ల భారతి,బోంతు రాంబాబు,వై.విక్రమ్, చింతల చేర్వు కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం,బండి రమేష్  పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నార

Related posts

మైలమాల శ్యాంసుందర్ కు డాక్టరేట్ ప్రధానం

Bhavani

ఇతర దేశాల విమానాలు ఆగేందుకు యుఏఈ సుముఖత

Satyam NEWS

అక్రమ సంబంధం కారణంగా దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment