37.2 C
Hyderabad
March 28, 2024 20: 45 PM
Slider పశ్చిమగోదావరి

నిబంధనలు పట్టించుకోని గ్రావెల్ మాఫియా

#gravel mafia

ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి పంచాయతీ పరిధి లోని అల్లివీడు లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణం లో గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. మైనింగ్, రెవిన్యూ శాఖల అనుమతులు లేకుండా చాటు మాటుగా గ్రావెల్ మాఫియా నిబంధనలను తుంగలో తొక్కి ప్రమాదకర స్థాయిలో గ్రావెల్ ను 20 అడుగుల లోతు వరకు తవ్వి తరలించుకు

పోతున్నారు. ఈ గ్రామం లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికి సంబంధిత అధికారులు
గ్రావెల్ తవ్వకాలను చూసి చూడనట్టుగా వదిలేయడం వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయని విశ్వసనీయ సమాచారం. గ్రావెల్ కొరకు తవ్విన పొలామంతా లోతైన లోయగా భయానకంగా మారింది. పొరబాటున

పశువులు గాని, పశువుల కాపరులు గాని ప్రమాదవ శాత్తూ కాలుజారి గ్రావెల్ లోయలో పడితే కనుచూపు మేరలో రక్షించే నాధుడే కనపడడు. కాపాడండి అంటూ అరిచి కేకలు పెట్టినా ఆ కేకలు చావు కేకలు ఔతాయి. ఈ వార్తపై సంబంధిత అధికారులు స్పందించి అల్లివీడులో గ్రావెల్ తవ్వకాల వద్దకు ఒక సారి వెళ్లి పరిశీలిస్తే పరిస్థితి కళ్లారా చూసి అధికారికంగా మీరే నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. ఆ గ్రావెల్ లోయలో జరగరాని ప్రమాదం జరగక ముందే తగిన చర్యలు చేపట్టాలని విజయరాయి, అల్లివీడు ప్రజలు కోరుతున్నారు.

Related posts

గ్రామ పంచాయతి భవనాలు త్వరగా పూర్తి చేయాలి

Bhavani

ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం

Satyam NEWS

రేపు కేటీఆర్, రేవంత్ రెడ్డి రాక: హాట్ హాట్ గా కామారెడ్డి రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment