27.7 C
Hyderabad
April 24, 2024 08: 10 AM
Slider ఖమ్మం

మహిళలకుసమాజంలో గొప్ప స్ధానo

#cpkmm

సమాజంలో ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తూ అనితరసాధ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళలకు సమాజంలో గొప్ప స్ధానం వుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  ఎస్ బి కాన్ఫరెన్స్ హాల్  లో ఘనంగా నిర్వహించారు.  ముందుగా కేక్ కట్ చేసిన మహిళ పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి, నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి…ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మహిళలకు 33% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని  అన్ని రంగాలలో మరింత రాణించాలని, నేటి పోటి ప్రపంచంలో  పురుషులకు దీటుగా ప్రతికూల పరిస్థితులను అధికమించి అన్ని రకాల వ్యవస్థలను నడిపే శక్తిగా మహిళలు రాణిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, మహిళలను తక్కువ చేసే దోరణి మారిందని అన్నారు.

కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్  ప్రదర్శించిన  నాటిక ఎంతగానో ఆకట్టుకుంది.మహిళలకు సంబంధించిన కేసులలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పోక్సో, నిర్భయ చట్టాలను జిల్లాలో  పకడ్భందిగా అమలవుతున్నాయని అన్నారు.ముఖ్యంగా యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్ 100, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ విభాగాలలో  పనిచేస్తున్న  పలువురు మహిళలను  సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్  డీసీపీ కుమారస్వామి, కృష్ణ ప్రసాద్ మెమరీ స్కూల్ చైర్ పర్సన్  హృదయ మీనన్,   ఏసీపీలు గణేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రవి, అక్తరూనీసా బేగం,  సిఐలు  అంజలి,  సర్వయ్య, సురేష్,  షీ టీమ్ ఎస్ ఉమా  పాల్గొన్నారు.

Related posts

న్యూ డైరెక్షన్: వ్యక్తిగత ఎజెండా వద్దు ప్రజాపాలనే ముద్దు

Satyam NEWS

దింపుడు కళ్లెం ఆశలా రాయలసీమ డిక్లరేషన్

Bhavani

దటీజ్ మోడీ: అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని

Satyam NEWS

Leave a Comment