39.2 C
Hyderabad
April 25, 2024 16: 49 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు

#ktr

తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏళ్లు.ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో..కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. చరిత్రను మలుపు తిప్పిన నవంబర్‌ 29వ తేదీ చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.మీ పోరాటం అనితర సాధ్యం.ఒక నవశకానికి నాంది పలికిన రోజు.ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు.తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు.చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్‌ 29, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు దీక్షా దివస్ అని ట్వీట్‌ చేశారు.

ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ‘తెలంగాణ తెచ్చుడో..కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగారని, .ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును టీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌గా పాటిస్తున్నదని,  2009 నవంబర్‌ 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్‌ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్‌ బయలుదేరగా,కరీంనగర్‌ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారన్నారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించి, ఆ తరువాత నిమ్స్‌ దవాఖానకు తరలించగా .అక్కడే కేసీఆర్‌ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారన్నారు.  తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని డిసెంబర్‌ 9న యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే ఆయన దీక్షను విరమించారని గుర్తుచేశారు.

Related posts

ప్రతి పంటకు మద్ధతు ధర లభిస్తుంది

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

Satyam NEWS

ఆరేళ్ల బాలికపై వైసిపి కార్యకర్త అత్యాచారం

Satyam NEWS

Leave a Comment