36.2 C
Hyderabad
April 25, 2024 20: 51 PM
Slider ముఖ్యంశాలు

శబరి కి తప్పిన ముప్పు

#shabari

హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ (17230)కు గుంటూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు నల్లపాడు-గుంటూరు సెక్షన్‌లో ప్రయాణిస్తున్న క్రమంలో పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. లోకోపైలట్ గుర్తించకుంటే కనుక పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. రైలును ఆపిన అనంతరం రైల్వే సిబ్బంది రాడ్డును తొలగించారు. దీంతో రైలు తిరిగి బయలుదేరింది. దుండగులు పొడవైన ఇనుపరాడ్డును పట్టాలపై అడ్డంగా పెట్టి, రైలు వస్తున్నప్పుడు దాని అదురుకు అది కిందికి పడిపోకుండా పట్టాలకు గుడ్డతో కట్టారు. దుండగులు పథకం ప్రకారమే దానిని కట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై గస్తీ నిర్వహించే సిబ్బంది తనఖీ చేసుకుంటూ వెళ్లిన అనంతరం వారు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.

Related posts

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

మొక్క‌లు నాటిన స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస‌రావు

Satyam NEWS

ఒడిషా రాజకీయాల్లో టీచర్ హత్య కేసు ప్రకంపనలు

Sub Editor

Leave a Comment