18.3 C
Hyderabad
December 6, 2022 07: 08 AM
Slider కృష్ణ

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

ఒక మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన నందిగామ పట్టణంలో గురువారం పద్మశ్రీ హాస్పటల్లో జరిగింది. నందిగామ పట్టణానికి చెందిన షేక్ అమీనా భర్త సర్ధార్ నిరుపేద దంపతులు. అమీనా పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు బ్లడ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు సకాలంలో స్పందించి మానవతాదృక్పధంతో డబ్బులు తీసుకోకుండా, ఆమెకు గురువారం ఉదయం సర్జరీ చేశారు.

నిమిషాల వ్యవధిలోనే తొలుత ఇద్దరు మగ శిశువులు. ఆ తర్వాత ఒక ఆడ శిశువు జన్మించారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించటంతో ఆ కుటంబ సభ్యులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పలువురు ప్రముఖులు ఆ తల్లిని, పిల్లలను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు డా.సురేష్, డా.మనోరమ,డా.భరద్వాజ, డా.వెంకటేష్, నర్సులు పాల్గొని వైద్య సేవలు అందించి ముగ్గరు కవల పిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తిని అభినందించారు.

Related posts

నితిన్ రష్మికలతో వస్తున్నచిత్రం భీష్మ

Satyam NEWS

రాజంపేట ఎమ్మెల్యే మేడా ఆలయ పర్యటన పై వివాదం…

Satyam NEWS

ఆయుష్మాన్ భారత్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!