36.2 C
Hyderabad
April 24, 2024 22: 12 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కొత్త మలుపు

#conspiracy case

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు కొత్త మలుపు తిరిగింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. హైదరాబాదులో నర మేధం సృష్టించేందుకు ముగ్గురు ఉగ్రవాదులు కుట్ర పన్నారు.

ఈ కుట్ర కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. అందుకు ముందే హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. జాహీద్ అనే వ్యక్తితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. జాహీద్ కు ఆర్థిక సాయం చేసినట్లు అబ్దుల్ కలీమ్ పై పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అబ్దుల్ కలీం జాహీద్ కు 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాడు.

కలీం ఇచ్చిన 40 లక్షల రూపాయల తో జాహీద్ కార్లు బైకులు కొనుగోలు చేశాడు. విదేశాలను వచ్చిన హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు కుట్ర పన్నింది జాహీద్ ముఠా. కార్లు బైకులు హ్యాండ్ గ్రానైట్ల పెట్టి పేల్చడానికి కుట్ర పన్నారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాదులో జరిగే ఉత్సవాల్లో పేలుడు కు కుట్ర పన్నారు. గతంలోనే ఈ కుట్రని పోలీసులు భగ్నం చేశారు.

Related posts

కోవాక్సిన్: అతి త్వరలో కరోనా వ్యాక్సిన్ రెడీ

Satyam NEWS

చెట్టుకు ఊరేసుకొని గీత కార్మికుడు మృతి

Bhavani

టీడీపీ అధినేత అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ కాగడాల ర్యాలీ

Satyam NEWS

Leave a Comment