అడవిలో చిక్కుకున్న పోలీ సు బలగాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు.
గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్ ఘడ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు దారి తెలియక అడవిలోనే చిక్కుకుపోయారు
ఎలిమిడి ఎన్ కౌంటర్ లో పాల్గొని తిరుగు ప్రయాణం లో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంక లు ఉదృతంగా పారుతుం డడంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకుపోయారని తెలిసింది..
నడవలేని స్థితిలో ఉండగా అది తెలుసుకున్న పోలీసు యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటాహుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు.
మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసు పత్రికి తరలించారు.