28.7 C
Hyderabad
April 20, 2024 07: 48 AM
Slider జాతీయం

రీసెర్వ్డ్:రైల్ లో పరమేశ్వరునికి ప్రత్యేక బెర్త్

a seat reserved for bolashankae in kasimahakaal rail

వార‌ణాసి నుంచి ఇండోర్ మ‌ధ్య న‌డిచే కాశీమ‌హాకాల్ ఎక్స్‌ప్రెస్ అనే కొత్తప్రైవేట్ రైలును ప్ర‌ధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. అయితే ఆ రైలులోని బీ5 ఏసీ కోచ్‌లో 64వ బెర్త్‌ను ప‌ర‌మేశ్వ‌రుడికి కేటాయించారు. ఆ సీటులో శివుడికి పూజ‌లు చేసి రైలును స్టార్ట్ చేశారు. కాశీలోని విశ్వ‌నాథ్‌, ఉజ్జ‌యినిలోని మ‌హాకాళేశ్వ‌ర్‌, ఇండోర్‌లోని ఓంకారేశ్వ‌ర్ జ్యోతిర్లింగాల‌ను ట‌చ్ చేస్తూ ఆ రైలు వెళ్తుంది.

బోళాశంక‌రుడి కోసం కేటాయించిన ఆ సీటును ప‌ర్మ‌నెంట్‌గా ఉంచాలా లేదా అన్న దానిపై ఇంకా అధికారులు నిర్ణ‌యం తీసుకోలేదు. రైలులో దేవుడి కోసం ఓ సీటును కేటాయించి, ఆ సీటును ఖాళీగా వ‌దిలేయడం ఇదే మొద‌టిసారి. శివుడి కోసం కేటాయించిన సీటును అందంగా తీర్చిదిద్దారు. మ‌హాకాళేశ్వ‌రుడి ఆల‌యం బొమ్మ‌ను వేశారు. రైలులో ఆధ్మాత్మిక మ్యూజిక్‌ను ప్లే చేస్తారు. కేవ‌లం వెజిటేరియ‌న్ మీల్స్‌ను స‌ర్వ్ చేయ‌నున్నారు. మొత్తం థార్డ్ ఏసీ కోచ్‌ల‌తో ఉండే ఈ రైలు వారానికి మూడు సార్లు న‌డుస్తుంది.

Related posts

ప్రగతి భవన్ కుక్క ఆకస్మిక మరణం

Satyam NEWS

గజ్వేల్ దళిత రైతు మరణం ప్రభుత్వ హత్య

Satyam NEWS

జీతాల్లో కోత విధించేందుకు ఇది ఆర్ధిక ఎమర్జెన్సీ కాదు

Satyam NEWS

Leave a Comment