భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఎజ్రా పేర్కొన్నారు. అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న పూలే పార్కు వద్ద అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎజ్రా మాట్లాడుతూ గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా మనదేశాన్ని తీర్చిదిద్దడంలో డా.అంబేద్కర్ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గూర్చి ఆయన కొనియాడారు.
కుల మతాలకు అతీతంగా అందరూ అభిమానించే నేత బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమేనని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి.. ప్రపంచానికి మార్గదర్శిగా మన రాజ్యాంగం నిలవడానికి ప్రధాన కారకులు అంబేడ్కర్ అని రాజ్యాంగ నిర్మాతగా పిలుచుకొనే అంబేడ్కర్ లేకపోతే ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. అంబేడ్కర్ న్యాయవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా దేశానికి చేసిన ఎనలేని సేవలను వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు కెఎన్ మూర్తి, ఆకుల కృష్ణ, ఉపాధ్యక్షులు బమ్మిడి వేణు, గొండు మణికుమార్, రాయి రాము, పరిడాల పద్మభూషణ్ సాయి, మోహన్, సురేష్, నీలి కిరణ్ ,పైడి మోజెస్ రాజు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.