36.2 C
Hyderabad
April 24, 2024 22: 42 PM
Slider ప్రత్యేకం

గల్ఫ్ కార్మిక హక్కుల ఉద్యమకారులకు దక్కిన గౌరవం

ప్రత్యేక ఆహ్వానం మేరకు మక్తల్ లో గురువారం (27.10.2022) నాడు పున:ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో పాల్గొనడానికి.. పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు, గల్ఫ్ వలస కార్మిక హక్కుల ఉద్యమకారులు స్వదేశ్ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఉమ్మడి నాగరాజు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రలో ఉదయం నడక ముగిసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం బొందల్‌కుంట తాత్కాలిక శిబిరంలో ‘యాత్రీస్’ ఇతర ప్రముఖులకు వసతి ఏర్పాటు చేశారు. శిబిరంలో మధ్యాహ్న భోజనం సందర్భంగా కొందరు సహ యాత్రికులతో గల్ఫ్ కార్మిక నాయకులు ముచ్చటించారు.

రాజ్య సభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్; తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క; మాజీ ఎంపీలు మధు యాష్కీ; పొన్నం ప్రభాకర్; సామాజిక ఉద్యమకారిణి సజయ కాకరాల; మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు; మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి లను గల్ఫ్ జెఏసి నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్ రెడ్డి లు కలిశారు.

గల్ఫ్ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ పాదయాత్ర ద్వారా తమకు ఒక అవకాశం లభించిందని సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ కార్మిక నాయకుల రెండవ బృందం నవంబర్ 1 నుండి యాత్రలో పాల్గొంటుందని ఆయన తెలిపారు.

Related posts

హెల్మెట్ పెట్టుకోండి..ప్రాణాలు కాపాడుకోండి..అంటున్న ట్రాఫిక్ పోలీసులు

Satyam NEWS

పుదుచ్చేరి రాష్ట్రంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన

Satyam NEWS

పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలకు నటుడు సుమన్‌ ఖండన

Satyam NEWS

Leave a Comment