నెల్లూరు నగర పాలక సంస్థ పాలన సుభిక్షంగా సాగాలని ఆనం రంగమయూర్ రెడ్డి బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రొట్టెలపండుగ సందర్భంగా గురువారం ఉదయం నగరంలోని బారాషహీద్ దర్గా సందర్శించి షహీద్ సమాధుల వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గాకమిటి అధ్యక్షులు, మత పెద్దలు నెమలి పింఛంతో ఆనం రంగమయూర్ రెడ్డి నీ ఆశీర్వదించారు. అనంతరం వారు రొట్టెలపండుగ ఏర్పాట్లపై స్వర్ణాల చెరువు ఘాట్ ను సందర్శించి భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి విచారించారు. తదనంతరం వారు రొట్టెలను పట్టుకుని , గత సంవత్సరం మా ఇంటి పెద్ద మా చిన్నాన్న ఎమ్మెల్యే కావాలని రొట్టె పట్టుకున్నాను, నెల్లూరు ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు నగర పాలక సంస్థ తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్లాలని, కోరారు. ఈ పర్యటనలో షమీమ్,నజీమా, సుగుణమ్మ,సుజాత ముసావిర్,అజస్ ,ముసాదిఖ్ ,గయాజ్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post