36.2 C
Hyderabad
April 16, 2024 19: 00 PM
Slider జాతీయం

ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్ధిగా ఇసుదాన్ గధ్వీ

#IsudanGadhavi

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇసుదాన్ గధ్వీని ఎంపిక చేసుకున్నది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పార్టీ అంతర్గతంగా చేసిన సర్వేలో 75 శాతం మంది ఇసుదాన్ గధ్వీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఓటు వేశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో విజయం సాధించిన కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అధికార బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆప్, ఏఐఎంఐఎం సహా ఇతర పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఆప్ వర్గాల సమాచారం ప్రకారం, ఇసుదాన్ గాధ్వితో పాటు గోపాల్ ఇటాలియా కూడా సీఎం అభ్యర్థిత్వ రేసులో పోటీ పడ్డారు. గోపాల్ ఇటాలియా ఆ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు. ఆప్ సీఎం అభ్యర్థి రేసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా పేరు ముందు వరుసలో ఉండేది.

ఇటాలియా గుజరాత్‌లోని పాటిదార్ కమ్యూనిటీకి చెందిన వారు. పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమంలో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. గాధ్వి మాజీ జర్నలిస్టు. ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత గుజరాత్‌లో ఆప్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. శనివారం నుంచి పార్టీ రోడ్‌షోను ప్రారంభించనుంది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గుజరాత్‌లో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గద్వీతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఆప్ రోజూ రెండు మూడు రోడ్ షోలు నిర్వహించనుంది. గుజరాత్ ఎన్నికల్లో ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది.

రాష్ట్రంలో అధికార భాజపా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా పూర్తి బలాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా ఈసారి కూడా విజయపతాకాన్ని రెపరెపలాడించేందుకు ప్రయత్నిస్తోంది. పంజాబ్‌లో గెలిచిన తర్వాత ఆప్ కూడా గుజరాత్‌పై రెచ్చిపోతోంది. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం కూడా గట్టి ప్రయత్నం చేస్తుంది.

Related posts

గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

Satyam NEWS

మానవాళిని కాపాడుకోవడానికే గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

శివుడా! ఆయనెవరు? నా దేవుడు మంత్రి పెద్దిరెడ్డే!

Satyam NEWS

Leave a Comment