38.2 C
Hyderabad
April 25, 2024 14: 04 PM
Slider ప్రత్యేకం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం

aravind kegrival

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గతంలో కన్నా మెరుగు పడినా అధికారం అందుకోవడం మాత్రం సాధ్యపడలేదు. నేటి ఉదయం ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ట్రెడ్స్ బట్టి మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో  55 స్థానాల్లో ఆప్‌, 13 స్థానాల్లో బిజెపి, ఇతరులు ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, ప్రతాప్‌గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నారు.  న్యూఢిల్లీ, ఉత్తర ఢిల్లీలో ఆప్‌ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తోంది.  షార్దా, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, నైరుతి ఢిల్లీలో ఆప్‌ ఏకపక్షంగా దూసుకెళ్తోంది. రోహిణి నియోజకవర్గంలో బిజెపి నేత విజయేంద్ర కుమార్‌ ముందంజలో ఉన్నారు.

Related posts

అంబర్ పేట్ అమ్మవారి దేవస్థానంలో కొత్త సభ్యులకు అవకాశం కావాలి

Bhavani

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

Sub Editor 2

ఎల్లూరు గ్రామ రైతులకు కాంగ్రెస్ నేత సంఘీభావం

Satyam NEWS

Leave a Comment