31.7 C
Hyderabad
April 19, 2024 02: 53 AM
Slider వరంగల్

ఆశా వర్కర్ పై జరిగిన దాడికి ములుగులో నిరసన

#AashaWorkers

వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం కొన్నూరు తండా ఆశా వర్కర్ శనివారం సబీసెంటర్ లో విధులు నిర్వహిస్తుండగా కొందరు దాడి చేశారు. అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ములుగు జిల్లా వ్యాప్తంగా అన్నీ పిహెచ్ సి, సబీసెంటర్ లలో నేడు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశం లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ పాల్గొన్నారు.

గత ఆరు నెల నుండి కరోనా వైరస్ గురించి జాగ్రత్త లు చెబుతూ, హోం క్వారంటైన్ లో వున్న వారికి సమయానికి మందులు ఇస్తూన్న ఆశాలపై దాడి చేయడం కరెక్టు కాదని అన్నారు.

ఒకరోజు కూడా ఖాళీ లేకుండా ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్న ఆశా లపై దాడులు సరికాదని వారన్నారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటన లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ఆశాల  కు కనీస వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ వాలంటీర్ కమ్యూనిటీ హెల్త్ (ఆశా)వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షు రాలు రత్నం నీళాదేవి, రమాదేవి, పద్మ, శిరీష, సుజాత, సంబళష్మి, సుధా, నళిని, కేతా, సరోజన లు పాల్గొన్నారు.

Related posts

కరోనా చికిత్సలో కొత్త ప్రోటోకాల్ పూర్తి వివరాలు ఇవి

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: కటకటాల్లోకి విలేకరి, అతని స్నేహితులు

Satyam NEWS

వేములవాడ మండలంలో కార్డన్ అండ్ సెర్చ్

Satyam NEWS

Leave a Comment