28.7 C
Hyderabad
April 17, 2024 03: 31 AM
Slider నిజామాబాద్

పని చేస్తున్న ఆశా వర్కర్ల ను పర్మినెంట్ చేయాలి

CITU Kamareddy

ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని సి ఐ టి యూ  జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ డిమాండ్ చేశారు. సత్యం న్యూస్ తో కామారెడ్డి జిల్లా  బిచ్కుంద లో ఆయన మాట్లాడుతూ  పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త ఆశాలను నియమించాలని, వీరికి  కనీస నెలసరి వేతనం 24000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆశాలకు వేతనం ఫిక్స్ చేయకపోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆర్దికంగా వెనుకబడిన రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వం  10000/- ఫిక్స్ డ్ శాలరీ ఇస్తుంటే, ధనిక రాష్ట్రంలో ఏమైందని ప్రశ్నించారు. రోజు రోజు కు ఆశలకు పనిభారం పెరుగుతుందని, ప్రభుత్వo అన్నిరకాల పని భారాలను ఆశాలపైనే మోపుతున్నారనీ అన్నారు.

కరోనా కేసుల మూలంగా ప్రసూతి కేసులు ప్రభుత్వ ఆసుపత్రిలో రావటం లేదనీ, అలాంటప్పుడు ప్రసూతి కేసులు లేకపోతే జీతం  ఇవ్వమని అనటం ఎంతవరకు సమంజసం  అంటూ ఆయన  ప్రశ్నించారు. ఆశలకు 50 లక్షలు జీవిత బీమా ఇస్తూ ప్రతి ఆశలకు ప్రభుత్వమే ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తూ, పి పి కిట్, శానిటైజర్, గ్లవుజ్, మాస్క్ లను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆశల పైన పనివత్తిడి తగ్గించాలని సమస్యల పరిష్కారం కోసం ఆశలు చేస్తున్న పోరాటానికి సి ఐ టి యూ అండగా వుంటూ వారి సమస్యలు పరిష్కారం కై ఎలాంటి ఉద్యమానికైనా ముందుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్ చేశారు.

Related posts

అధిక ధరలతో జనజీవనం అస్తవ్యస్తం

Bhavani

విభజన కన్నా ఎక్కువ విధ్వంసం చేసిన జగన్ పాలన

Satyam NEWS

రామంతపూర్ మహా పడిపూజలో పాల్గొన్న ప్రముఖులు

Satyam NEWS

Leave a Comment