విశ్రాంత ఐపీఎస్ అధికారి, జగన్ రెడ్డి హయాంలో దారుణ అవమనాలకు గురైన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ఏపి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. జగన్ రెడ్డి హయాంలో 2 దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసింది. జగన్ ప్రభుత్వం సమయంలో ప్రదర్శించిన దాష్టీకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొంత వరకు సరిదిద్దింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఏబీవీ సస్పెన్షన్ అయ్యారు. రెండో విడతలో 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు మరోమారు సస్పెన్షన్ చేశారు. ఈ రెండు సార్లు కూడా ఆయన న్యాయస్థానాల్లో గెలిచారు. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు ఆయన చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలే ఏబీవీపై నమోదైన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
previous post