37.2 C
Hyderabad
March 29, 2024 20: 41 PM
Slider సినిమా

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఎవరో మీకు తెలుసా?

#young modi

మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఫొటోలో ఉన్నది నరేంద్ర మోడీ…

అయితే ఇప్పుడు కాదు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు. నిజం. మీరూ ఈ నిజాన్ని తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

ప్రముఖ చిత్ర నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ తీస్తున్న మన్ బైరాగి చిత్రంలో యంగ్ మోడీ పాత్రను పోషిస్తున్నది ఈ యువహీరోనే.

అభయ్ వర్మ అనే ఈ యువ హీరో ది ఫ్యామిలీ మెన్ 2 సీరీస్ లో నటించాడు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో విలన్ గా నటించినా ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలీ దృష్టిలో పడి యువ మోడీ అవతారం ఎత్తుతున్నాడు.

ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ నరేంద్రమోడీ చిత్రం మన్ బైరాగీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. యువతకు మంచి సందేశం ఇచ్చే చిత్రమని, ఇందులో నటించడం తన అదృష్టమని అంటున్నాడు అభయ్ వర్మ.

నరేంద్ర మోడీ జీవితంలో జరిగిన రెండు మూడు సంఘటనల ఆధారంగా నడిచే ఈ చిత్రం ఎటూ తేల్చుకోలేని యువతకు మార్గదర్శనం చేస్తుందని అతను చెప్పాడు.

ఈ చిత్రంలో నటించేందుకు మోడీ స్నేహితులను తాను కలిసినట్లు వర్మ చెప్పాడు.

మోడీని కూడా కలవాల్సి ఉంది కానీ కరోనా కారణంగా అది ఇప్పటి వరకూ సాధ్యం కాలేదని అభయ్ వర్మ తెలిపాడు.

Related posts

కరోనా సమయంలో కాకినాడ రూరల్ జర్నలిస్టుల సంక్షేమ కమిటీ

Satyam NEWS

ప్రాపర్టీ చోరీ కేసుల్లోని ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు

Satyam NEWS

ఈడి కేసులో హైకోర్ట్ కు నామా

Murali Krishna

Leave a Comment