ఏపీ సీఐడీ మాజీ డీజీ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు అయింది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో A1గా సంజయ్, A2గా సాత్రిక టెక్నాలజీ సంస్థను పెట్టారు. A3గా Kritvyap టెక్నాలజీ సంస్థను ఏసీబీ చేర్చింది. సంజయ్ ఫైర్, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక వచ్చిన విషయం తెలిసిందే. నివేదిక పరిశీలించిన ప్రభుత్వం సంజయ్‌ను సస్పెండ్ చేసింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను ఏసీబీకి ప్రభుత్వం పంపింది. ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. సంజయ్‌ను విచారించేందుకు ఇప్పటికే సీఎస్ అనుమతినిచ్చారు.
previous post