అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబునాయుడికి ఒక్కొక్కటిగా కష్టాలు చుట్టుకుంటున్నాయి. పార్టీ పరిస్థితి దిగజారడంతో బాటు ఆయనపై వ్యక్తిగతంగా ఉన్నకేసులు కూడా బయటకు వస్తున్నాయి. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఇప్పుడు చంద్రబాబుకు శాపంగా మారిపోతున్నది. చంద్రబాబునాయుడికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ చేసే వీలు లేకుండా చంద్రబాబు 2005లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, స్టే విష యంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమ వారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది.
previous post