39.2 C
Hyderabad
March 29, 2024 14: 05 PM
Slider సినిమా

యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ‘చోరుడు’ ఫస్ట్ లుక్ లాంచ్

#Chorudu

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత జి. డిల్లీబాబు యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై ‘చోరుడు’ అనే కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జివి ప్రకాష్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ఇవానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే దర్శకుడు బాలా ‘ఝాన్సీ’లో జివి ప్రకాష్, ఇవానా ఇద్దరూ స్క్రీన్‌ను పంచుకోవడం విశేషం. ‘చోరుడు’ అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా.

పివి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీని కూడా అందిస్తున్నారు. పివి శంకర్, రమేష్ అయ్యప్పన్‌ కలసి కథ & స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే రాజేష్ కన్నాతో కలిసి ఇద్దరూ డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ ఈ రోజు విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రధాన తారాగణం రస్టిక్ గెటప్‌లో కనిపిస్తుంది.

ఓ భారీ ఏనుగు పాదం పై నిలబడి వున్న ప్రధాన తారాగణం, బ్యాక్‌డ్రాప్‌లోని చెట్లు చూస్తుంటే.. కథ అటవీ నేపథ్యంలో సెట్ చేయబడిందని తెలియజేస్తోంది. ఏనుగు పాదం కింద వున్న రూపాయి కాయిన్ కూడా ఫస్ట్ లుక్ లో గమనించవచ్చు. 2023 వేసవిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ధీనా, జి. జ్ఞానసంబందం, వినోద్ మున్నా, ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే మేకర్స్ ట్రైలర్, ఆడియో, సినిమా విడుదల తేదిలని తెలియజేస్తారు.

Related posts

వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులుగా మజ్జి శ్రీనివాసరావు

Satyam NEWS

బలహీన వర్గాలు అభివృద్ధి కి ఉద్యమించిన మహాత్మా పూలే

Satyam NEWS

యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా సంతోషి బాధ్యతలు

Satyam NEWS

Leave a Comment