30.7 C
Hyderabad
April 24, 2024 01: 40 AM
Slider నల్గొండ

అనుమతి లేకుండా చెట్లు నరికితే చట్ట ప్రకారం చర్యలు

#Nalgonda Collector

అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో చెట్లు నరికి వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం లో హైవే వెంబడి అవెన్యూ ప్లాంటేషన్,చిట్యాల మండలం నేరేడ గ్రామం లో పల్లె ప్రకృతి వనం, ఉరుమడ్ల, చిన కాపర్తి జి.పి.ల్లో పల్లె ప్రగతి,అవెన్యూ ప్లాంటేషన్,డంప్ యార్డ్ లు,వైకుంఠ ధామం లు నిర్మాణం పనులు పరిశీలించేందుకు కలెక్టర్ క్షేత్ర స్థాయి లో పర్యటించారు.

కలెక్టర్ పర్యటన ముగించుకుని  అటవీ అధికారులు ఇచ్చిన సమాచారం ననుసరించి నల్గొండ వెళ్తూ చిట్యాల పెద కాపర్తి గ్రామ శివారులో ఎన్.గ్రిల్ హోటల్ యాజమాన్యం తమ హోటల్ ముందు ఎన్.హెచ్ 65 వెంబడి హరిత హరం లో నాటిన 55 చెట్లు నరికి వేసిన ప్రాంతాన్ని పరిశీలించి హోటల్ యాజమాన్యం పై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి హోటల్ సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల ననుసరించి చిట్యాల తహశీల్దార్ హోటల్ ను సీజ్ చేశారు.అటవీ అధికారులు వాల్టా చట్టం  ప్రకారం కేసు నమోదు చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నోటీస్ జారీ చేశారు.

ప్రభుత్వం పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు తెలంగాణ కు హరిత హరం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోందని, హరిత హరం లో నాటిన చెట్లను నరికి వేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,తహశీల్దార్ కృష్ణా రెడ్డి,ఎం.పి.డి. ఓ.లాజర్,అటవీ,మండల పంచాయతీ అధికారి,ఇతర అధికారులు ఉన్నారు.

Related posts

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ

Bhavani

ఘనంగా ఉక్కుమనిషి సర్దార్ పటేల్ జయంతి

Satyam NEWS

నిమ్మగడ్డ కేసులో స్టే ఇవ్వకుండా కెవియట్ దాఖలు

Satyam NEWS

Leave a Comment