39.2 C
Hyderabad
March 29, 2024 17: 10 PM
Slider మహబూబ్ నగర్

సోషల్‌ మీడియాలో అవాస్తవ సందేశాలు పంపితే చర్యలు

sp sai sekhar

కరోనా వ్యాధి పైన అపోహలు, తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి డాక్టర్ సాయి శేఖర్ హెచ్చరించారు.

అవాస్తవమైన వార్తలు  ప్రచారం  చేస్తున్నారని, సోషల్ మీడియాలో‌ ఇలాంటి వార్తలు  ప్రచారం  చేస్తూ ప్రజలను అనవసరంగా భయాందోళనలకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కరోనా వ్యాధికి  సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు.

ఇలాంటి ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన సృష్టిస్తుందని ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన అవాస్తమైన సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్‌ సెక్షన్‌ 54 కింద కేసును నమోదు చేస్తామన్నారు.

ఈ సెక్షన్‌ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

Related posts

హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నిమ్మగడ్డ

Satyam NEWS

ఫథలాపూర్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

బీఆర్ఎస్ ఖాళీ అయ్యే రోజు వచ్చింది: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment