35.2 C
Hyderabad
April 20, 2024 16: 10 PM
Slider ముఖ్యంశాలు

పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ

#brs

దేశంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తుందని పార్టీ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ కు అమితమైన ఆదరణ లభిస్తోందన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ అభివృద్ధి కి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారని నామ అన్నారు.

కేసీఆర్ అభివృద్ధి మోడల్ ను దేశ ప్రజలు అధికంగా కోరుకుంటున్నారని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ అంటూ కేసీఆర్ ఇచ్చిన నినాదం అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు.అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రైతుల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉండడం వల్ల మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో రైతులు బీఆర్ఎస్ లోకి వెల్లువులా వస్తున్నారని తెలిపారు.

తెలంగాణా లో అమలవుతున్న రైతు బంధు , రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్,సాగు, తాగు నీటి వంటి రైతు పధకాలు పట్ల మహారాష్ట్ర రైతాంగం ఎక్కువ మక్కువ చూపిస్తూ, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. పార్టీ పట్ల, కేసీఆర్ అద్భుత విధానాల పట్ల మరింత ఆసక్తి ఆదరణ పెరిగిందన్నారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ విస్తరణ పెరగడంతో అక్కడి సర్కార్ లో గుబులు బయలు దేరిందన్నారు.

మరో వైపు పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు దిశగా కార్యాచరణ ఆరంభమైందని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.అందులో భాగంగా అతి త్వరలోనే మహారాష్ట్ర , ఏపీ, ఒడిశా, తదితర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని నామ చెప్పారు.అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాలు న్యూఢిల్లీ, హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయాలతో అనుసంధిస్తారని నామ చెప్పారు.

Related posts

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Satyam NEWS

జీవ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Satyam NEWS

రోడ్డు ప్రమాదం లో నీట్ విద్యార్థిని మృతి

Satyam NEWS

Leave a Comment