భారత ప్రధమ ప్రధాని జవహర్ లాన్ నెహ్రూపై వివాదాస్పద వీడియో చేసిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నేటి ఉదయం స్థానిక కోర్టు ఆమెకు 8 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అక్టోబర్ 10వ తేదీన పాయల్‌పై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు.
నెహ్రూ-గాంధీ కుటుంబంలోని మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై హీరోయిన్ పాయల్ ఓ వివాదాస్పద వీడియోను చేసింది. అంతే కాకుండా ఇందిరాగాంధీ మాతృమూర్తి, జవహర్ లాల్ నెహ్రూ సతీమణి పై కూడా ఆమె దారుణమైన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేసింది.
దీనిపై గతంలో ఆమెకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చారు. రాజస్థాన్‌లోని బుండీ పోలీసు స్టేషన్‌కు ఆమెను విచారణ కోసం తీసుకువెళ్లారు. కేసు విచారణకు సహకరించకపోవడం వల్లే పాయల్‌ను అరెస్టు చేయాల్సి వచ్చినట్లు ఎస్పీ మమతా గుప్తా తెలిపారు.