ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనుకోకుండా అకస్మాత్తుగా అనంతపురం వచ్చాడు. నిజం అతను అక్కడికి రావడమే కాకుండా ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను కూడా సందర్శించాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పగిడిరాయి గ్రామానికి సొంత పనిపై వెళ్తూ మార్గమధ్యంలో ఆర్డీటీ స్టేడియాన్ని గిల్ క్రిస్ట్ సందర్శించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారన్నారు. ఇక్కడ క్రికెట్‌కు బాగా ప్రోత్సాహం ఉందన్నారు. ఆర్డీటీ స్టేడియం చాలా అద్భుతంగా ఉందన్నారు క్రిస్ట్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ టీమ్ ప్రదర్శన చాలా బలంగా ఉందంటూ కొనియాడారు. మిగిలిన జట్లకు ఇండియన్ టీం ప్రమాదకరంగా మారిందన్నాడు క్రిస్ట్. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం ఆటతీరుపై కూడా గిల్ క్రిస్ట్ స్పందించాడు. సహజంగా ఒక్కోసారి కొన్ని మార్పులు జరుగుతుంటాయని ఫీల్డింగ్ లో కాస్త తడబాటు ఉందని తెలిపాడు.
previous post
next post