తెలంగాణా స్టేట్ డెమోక్రసీ అవార్డుకు ఎంపిక అయిన ప్రస్తుత ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్యకు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై.సాయి శేఖర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
2019 సంవత్సరoలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిoచిన చెన్నయ్య జిల్లా ప్రజలతో సత్ససంబంధాలు కలిగి ఉండి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫారసు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “ తెలంగాణ స్టేట్ డెమోక్రసీ అవార్డు” కు ఎంపిక చేసింది. జిల్లా సిబ్బందితో కలిసి పని చేసి మంచి పేరు తెచ్చుకున్న చెన్నయ్యను సిబ్బంది అభినందించారు. ఈ అవార్డును ఈనెల 11న గవర్నర్ తమిళసైసౌoదర రాజన్ అందిస్తారు.