24.7 C
Hyderabad
March 26, 2025 09: 15 AM
Slider సినిమా

అక్టోబర్ 18న వస్తున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్

operation-gold-fish

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). సెన్సిబుల్ సినిమాలు ‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కేరింత’తో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కాబోతున్నది

Related posts

పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు

Murali Krishna

శ్రీవారి భక్తులకు భద్రత కల్పించడంలో టిటిడి వైఫల్యం!

mamatha

Leave a Comment