అపరవాల్మికి శ్రీ శివానందుల వారి శిష్యులు, మౌన స్వామి శ్రీ స్వామి రామానందుల వారు స్థాపించిన విజయనగరం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమంలో “ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ అంతర్ముఖానందుల (శ్రీగురూజీ) ఆదేశాలతో శ్రీగురూజీ సుపుత్రుడైన శివరామకృష్ణ దంపతులు…. అటు స్వామిజీ సమాధి మందిరంలోనూ, ఇటు ఆశ్రమ పీఠంలోనూ ఆది శంకరాచార్య జయంతి ఉత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో శంకరాచార్య సహస్రం, శ్రీ గురుగీత, గురర్వాష్ఠకం, తదితర గ్రంధాలను చదివారు. అనంతరం ఉత్సవంకు వచ్చిన శిష్యులకు ప్రసాదాలను అందించారు… ఆశ్రమ నిర్వాహకులు. ఈ ఉత్సవ కార్యక్రమంలో శ్రీగురూజీ కూతురు ఘాన్సీ దంపతులతో పాటు పలు ప్రాంతాల నుంచీ శిష్యులు హాజరయ్యారు.
previous post