39.2 C
Hyderabad
March 29, 2024 15: 12 PM
Slider ముఖ్యంశాలు

హ‌రిక‌థా పితామ‌హుడు ఆదిభ‌ట్ల ఇంటికెళ్లిన ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌

#adibhatlanarayanadas

ఆది క‌వి ఎవ‌రంటే న‌న్న‌య్య అని తెలుసు..మ‌రి హ‌రిక‌థ‌కు ఆద్యుడు,పితామ‌హుడు ఎవ‌రు అంటే..అక్క‌డికే  వ‌స్తున్నా…క‌ళ‌ల‌ల్లో అప్ప‌ట్లో  బాగా ప్రాచుర్యం పొందింది… హ‌రిక‌థ దానికే పితామ‌హుడు శ్రీ మ‌ద‌జ్జాడ ఆదిభఃట్ల నారాయ‌ణ దాసు. ఆయ‌న 157 జ‌యంతి సంద‌ర్బంగా స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి స్వ‌యంగా న‌గ‌రంలోని కానుకుర్తి వారివీధిలో ఉన్న ఆధిభ‌ట్ల స్వగృహానికి వెళ్లారు. ఆదిభ‌ట్ల మ‌న‌మడు…ఆనంద్ నారాయ‌ణ దాసు ఎమ్మెల్యే ను సాదరంగా ఆహ్వానించారు.

ఆదిభ‌ట్ల నివాసంలోకి వెళ్లిన ఎమ్మెల్యే కోల‌గట్ల‌..ఆయ‌న విగ్ర‌హానికి పూ ల‌దండ వేసి జ్యోతి వెలిగించి..విజ‌య‌న‌గ‌రంలో ఆధిభ‌ట్ల  ఓ ప్ర‌ముఖ‌డ‌ని స్థానికంగా ఉన్న నాకు ఆది నుంచీ తెలుసున‌ని  ఈ సంద‌ర్భంగా ఆయ‌నను గుర్తు చేసుకున్నారు. అనంత‌రం ఆధిభ‌ట్ల  మ‌న‌వ‌రాలిని క‌లిసి న‌మ‌స్క‌రించి…అనంత‌రం కాకినాడ‌కు చెందిన ప్ర‌ముఖ  హ‌రిక‌దా బాగ‌వ‌తార్ ను ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల సత్క‌రించారు.అనంత‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల మీడియాతో మాట్లాడుతూ నేటి త‌రంనాటి క‌ళ‌ల ప‌ట్ల మ‌క్క‌వ‌తో కూడిన బాధ్య‌త క‌లిగి ఉండాల‌న్నారు.

ప్రాచీన క‌ళ‌ల‌లో ఒక‌టైన హ‌రక‌థ నేటికి  త‌రించిపోకుండా ఉందంటే అందుకు ఆదిభ‌ట్ల వేసిన పునాదే కార‌ణ‌మ‌న్నారు. ఈ త‌రం వారికి హ‌రి క‌థ ప‌ట్ల ఆద‌ర‌ణ త‌గ్గుతున్నా… దాన్ని స‌జీవంగా  ఉంచేంద‌కు ఆధిభ‌ట్ల వంశీయులు తీవ్ర‌మైన కృషి చేయ‌డం అభింద‌నీయ‌మ‌న్నారు.అనంత‌రం ఆదిభ‌ట్ల మ‌నుమ‌డు ఆనంద్ నారాయ‌ణ దాసు మాట్లాడుతూ …తాత ఆశ‌యాల‌ను,హ‌రిక‌థల ప‌ట్ల అయ‌నకున్న స్పూర్తిని భ‌విష్య‌త త‌రాల‌కు అందించాల‌న్న ఉద్దేశ్యంతో ఆధిభ‌ట్ల ఫౌండేష‌న్ నెల‌కొల్పామ‌న్నారు.ఈ  కార్య‌క్ర‌మంలో  బ్రాహ్మ‌ణ సంక్షేమ సంఘం జిల్లా అధ్య‌క్షుడు కే.పీ.ఈశ్వ‌ర్, ఆయ‌న కూతురు స‌రోజ‌ని,ప్ర‌ముఖ మృదంగ విద్వాంసులు మండ‌పాక ర‌వి…స్థానిక కార్పొరేట‌ర్ లు పాల్గొన్నారు.

తెలుగు ప్రజలు గర్వించదగ్గ కళాకారుడు ఆదిభట్ల

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు  తెలుగు ప్రజలంతా గర్వించే కళాకారుడని, ఆయన మన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని  విజ‌య‌న‌గ‌రం జిల్లా జేసీ  ఆసరా జె.వెంకట రావు అన్నారు.  భాషా సాంస్కృతిక శాఖ అద్వర్యం లో  సంగీత నృత్య కళాశాలలో ఆదిభట్ల జయంతి  ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన జేసీ వెంక‌ట‌రావు ముందుగా కళాశాల ప్రవేశం ద్వార‌  వద్ద నున్న ఆదిభట్ల, ఘంటశాల చిత్ర పటాలకు  పూల మాలలు వేసి  నివాళులర్పించారు. 

అనంతరం జరిగిన సభ లో జేసీ  మాట్లాడుతూ హరికథ అనే కళను సమాజానికి పరిచయం చేసి, అభివృద్ధికి తోడ్పడిన గొప్ప వ్యక్తి  ఆది భట్ల  అని  జేసీ కొనియాడారు. అంతరించిపోతున్న కళల్లో ప్రస్తుతం హరికథ ఒకటని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ కు ప్రాధాన్యత నిస్తూ అధికారిక కార్యక్రమాల్లో హరికథ కు అవకాశం కల్పిస్తూ కళా కారులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. ఎందరో కళాకారులను అందించిన   సంగీత కళాశాల కు వై.ఎస్.ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను అందించడం గర్వంగా ఉందన్నారు. 

హరికధకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కాపీలేశ్వరం లో శిక్షణా కళాశాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఖాయం

Satyam NEWS

తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించిన లోకేష్

Satyam NEWS

కొండగట్టులో రామపూజ స్థూపానికి భూమి పూజ

Satyam NEWS

Leave a Comment