37.2 C
Hyderabad
April 18, 2024 21: 35 PM
Slider ఆదిలాబాద్

సుగంధ ద్రవ్యాలను పండిస్తున్న ఆదిలాబాద్ రైతు

#AdilabadFarmer

ఆదిలాబాద్ జిల్లా లోని భీంపూర్ మండల్ ధనోర గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గోవర్ధన్ యాదవ్ అధునాతన పద్దతిలో డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పసుపు, అల్లం, మిర్చి పంటలను విజయవంతంగా పండిస్తున్నాడు. ఈ పంటల్ని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ నేడు పరిశీలించారు.

ధనోర గ్రామంలో తన 10 ఎకరాల వ్యవసాయ భూమి లో అధునాతన పద్దతిలో డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పసుపు, అల్లం, మిర్చి పంటలు అద్భుతంగా పండుతున్నాయని రైతు చెప్పాడు. బెడ్, డ్రిల్ విధానాల ను ఎలా చేస్తారో సాజిద్ ఖాన్ అడిగి తెలుసుకున్నారు.

గోవర్ధన్ యాదవ్ పంట సాగు విధానం చాలా బాగుందని సాజిద్ ఖాన్ అన్నారు. పంట సాగు లో ఆయన పాటించే బెడ్, డ్రిల్ విధానాల వల్ల తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఆయన వేసే పసుపు, అల్లం, మిర్చి పంట చాలా నాణ్యమైనవిగా పేర్కొన్నారు.

జిల్లా లోని రైతులు ఈ విధానంలోని మెలుకువలు తెలుసుకోవాలంటే గోవర్ధన్ యాదవ్ ను సంప్రదించాలని కోరారు. సాజిద్ ఖాన్ తో బాటు ఉమ్రి సర్పంచ్ పెందుర్ లక్ష్మణ్, పోలిశెట్టి  తదితరులు ఉన్నారు.

Related posts

శివోహం: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన ముక్కంటి ఆలయాలు

Satyam NEWS

జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

రోడ్డు ప్రమాద మృతులకు ఆర్థిక సహాయం

Bhavani

Leave a Comment